twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అ'శోక' వనం

    By Staff
    |

    కొన్ని సినిమాలు అట్టాహాసంగా ప్రారంభమవుతాయి. కొన్ని సినిమాలు ఆటంకాలను ఎదుర్కొంటాయి. కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి షూటింగ్‌ చేసుకుంటూనే వుంటాయి. వాటిలో కొన్ని సంచలన విజయాలు సాధిస్తాయి. మరికొన్ని అడ్రస్‌ లేకుండా పోతాయి. ఇటీవల కాలంలో సంచలనం రేకెత్తిస్తున్న త్రిభాషా చిత్రం మణిరత్నం 'అశోకవనం" ఒకటి. భారతదేశం గర్వించదగ్గ దర్శక దిగ్గజం మణిరత్నం. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో రాముడుగా అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తుండగా రావణుడుగా జాతీయ నటుడు విక్రమ్‌ నటిస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్‌లో రాముడుగా విక్రమ్‌ నటిస్తుండగా రావణుడుగా అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్నారని అన్ని వెర్షన్‌లోనూ సీతగా అందాల ఐశ్వర్య నటిస్తున్నట్లు ఇంతవరకూ తెలిసిన వ్యవహారం.

    అయితే తాజా వార్త ఏమిటంటే తమిళ వెర్షన్‌లో రావణుడుగా విక్రమ్‌, రాముడుగా అభిషేక్‌ నటిస్తుండగా హిందీ వెర్షన్‌లో రావణుడుగా అభిషేక్‌, రాముడుగా పృధ్వీరాజ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదలా వుంచితే ఈ సినిమా ప్రారంభం నుంచి షూటింగ్‌లో అనేక అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. షూటింగ్‌లో వుండగా దర్శకుడు మణిరత్నంకు సడన్‌గా గుండెపోటు రావడంతో ఈ సినిమా అర్ధాంతరంగా కొన్నాళ్ళు ఆగిపోయింది. ఆయన హాస్పిటల్‌ నుంచి పూర్తి ఆరోగ్యంతో వచ్చి తిరిగి కేరళ అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించగా పర్మిషన్‌ లేదంటూ ఫారెస్ట్‌ అధికారులు అలజడి సృష్టించడంతో మరోసారి ఈ సినిమాకు అవాంతరం ఎదురయింది. ఆ సమస్య కూడా పరిష్కరించుకుని సజావుగా షూటింగ్‌ జరిగిపోతుంది అనుకుంటున్న సమయంలో లొకేషన్‌లో వుండగా సీత పాత్రధారి ఐశ్వర్య అస్వస్థతకు గురికావడం, ఊపిరి తిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ చేరిందని, ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న 'స్వైన్‌ ఫ్లూ" అని అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగ్‌లో చోటు చేసుకోవడంతో చిత్ర యూనిట్‌తో పాటు ఐశ్వర్య అభిమానులు కలవరం చెందుతున్నారు. ''నా కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌కు ఊపిరి తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరింది. అది స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కలిగి వుంది.

    ఆ సమయంలో నా పిల్లల చెంత లేకపోవడం చాలా బాధగా వుంది. వారికి పెళైనా నాకు మాత్రం పిల్లలే అంటూ"" సింగపూర్‌లో వైద్య పరీక్షలు చేసుకుంటున్న అమితాబ్‌ స్నేహితుడు, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అమర్‌ సింగ్‌ దగ్గర వున్న అమితాబ్‌ తన సందేశాన్ని అమితాబ్‌ బ్లాగ్‌లో పెట్టారు. దాంతో ఇప్పుడంతా ఈ సినిమా ప్రారంభం నుంచీ అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. ఏమిటి ఈ ప్రభావం అంటూ ఎక్కడ చూసినా 'రావణ" గురించే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మణిరత్నం సినిమా అనగానే ప్రేక్షకులల్లో క్యూరియాసిటీ సహజంగా వుంటుంది. దాంతో ఇటువంటి పరిణామాలతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. అన్ని అవాంతరాలను అధిగమించినట్లే కథానాయిక ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఆరోగ్యం కూడా కుదుటపడి ఆ సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X