»   » మెగాస్టార్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్: రామ్ గోపాల్ వర్మ ఏడ్చాడు!

మెగాస్టార్ ఇంటర్వ్యూ ఎఫెక్ట్: రామ్ గోపాల్ వర్మ ఏడ్చాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేను ఎలాంటి ఎమోషన్స్ లేని వ్యక్తిని అని రామ్ గోపాల్ వర్మ చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి వర్మ కూడా ఎమోషన్ అయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టారు. మరి వర్మను అంతలా ప్రభావింతం చేసిన అంశం ఏంటో తెలుసా?... అది మరేదో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ .

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ తో సర్కార్-3 సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా అమితాబ్ ఇటీవల సుభాష్‌ ఘాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ ఘాయ్ అడిగిన ప్రశ్నలు, దానికి అమితాబ్ సమాధానం చూసి ఎమోషన్ అయ్యారట వర్మ.

ఇంతకీ వర్మ గురించి బిగ్ బి ఏం చెప్పారు?

ఇంతకీ వర్మ గురించి బిగ్ బి ఏం చెప్పారు?

వర్మ స్థిరత్వంలేని దర్శకుడు అనే ప్రశ్నకు అమితాబ్‌ స్పందిస్తూ... స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే. ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్ష‌కుల‌కి బోర్‌ కొట్టిస్తాయి. ఎప్పుడూ నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులోని అంతాన్ని గుర్తించడంకష్టం. ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే రాంగోపాల్‌ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వం. ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వ‌ర్మ అంటూ.... అమితాబ్ గొప్పగా చెప్పారు.

ఏడ్చేసిన వర్మ

అమితాబ్ త‌న గురించి అంత గొప్పగా చెప్పడంతో వర్మ ఎమోషన్ అయ్యారు. ఏడ్చేసారు. బిగ్ బీకి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని అనుకుంటున్న‌ట్లు వర్మ పేర్కొన్నారు.

 సర్కార్ 3

సర్కార్ 3

ఇటీవలే సర్కార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. యాంగ్రీ లుక్ తో అమితాబ్ లుక్ అద్భుతంగా ఉంది అంటున్నారు అభిమానులు. గాడ్‌ ఫాదర్‌ సుభాష్‌ సర్కార్‌ నాగ్రే పాత్రలో అమితాబ్‌ నటించిన ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రామ్‌గోపాల్ వర్మ.

ఏప్రిల్ 7న విడుదల

ఏప్రిల్ 7న విడుదల

మనోజ్‌ బాజ్‌పాయ్‌, యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పరాగ్‌ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్‌ ఎ. లుల్లా తో కలిసి అమితాబ్‌ బచ్చన్ నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన 25ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా బర్త్‌డే రోజున వర్మ తొలిసారిగా తాను డైరక్ట్ చేసిన సినిమాను విడుదల చేస్తుండటం విశేషం.

English summary
"I am not at all an emotional person but what Amitji said about me in an interview with Subhash k Jha moved me to tears..I hope i deserve and I will live up to his trust." Ram Gopal varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu