»   » బాలీవుడ్ మెగాస్టార్ యాంగ్రీ లుక్ చూసారా? కేక అంతే....

బాలీవుడ్ మెగాస్టార్ యాంగ్రీ లుక్ చూసారా? కేక అంతే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'సర్కార్-3' రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. యాంగ్రీ లుక్ తో అమితాబ్ లుక్ అద్భుతంగా ఉంది అంటున్నారు అభిమానులు.

గాడ్‌ ఫాదర్‌ సుభాష్‌ సర్కార్‌ నాగ్రే పాత్రలో అమితాబ్‌ నటించిన ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రామ్‌గోపాల్ వర్మ.

sarkar 3

మనోజ్‌ బాజ్‌పాయ్‌, యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పరాగ్‌ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్‌ ఎ. లుల్లా తో కలిసి అమితాబ్‌ బచ్చన్ నిర్మిస్తున్నారు.

రామ్‌గోపాల్‌వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన 25ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా బర్త్‌డే రోజున వర్మ తొలిసారిగా తాను డైరక్ట్ చేసిన సినిమాను విడుదల చేస్తుండటం విశేషం.

English summary
Sarkar 3 first look poster is out and Amitabh Bachchan looks immense as Subhash Nagre. As the previous two parts of Sarkar are gigantic hits, let us wait and see how RGV made this one.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu