క్వీన్ ఎలిజబెత్-2కు షాకిచ్చిన అమితాబ్
యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ వేడుక సందర్భాన్ని పురస్కరించుకొని అరుదైన ఆహ్వానాన్ని బిగ్ బీకి క్వీన్ ఎలిజబెత్, డ్యూక్ ఆప్ ఎడిన్ బర్గ్ పంపించారు. అయితే ఆ వేడుకకు హాజరుకావొద్దని అమితాబ్ నిర్ణయించుకొన్నారు
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షాకిచ్చారు. యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ వేడుక సందర్భాన్ని పురస్కరించుకొని అరుదైన ఆహ్వానాన్ని బిగ్ బీకి క్వీన్ ఎలిజబెత్, డ్యూక్ ఆప్ ఎడిన్ బర్గ్ పంపించారు. అయితే ఆ వేడుకకు హాజరుకావొద్దని అమితాబ్ నిర్ణయించుకొన్నారు.

క్వీన్ ఎలిజబెత్, బకింగ్హమ్ ప్యాలెస్ పంపిన ఆహ్వానాన్ని నిరాకరించారు. ఆయన బిజీగా ఉండటం వలన ఆ వేడుకకు హాజరుకావడం లేదని అమితాబ్ పీఆర్వో మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సర్కార్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మార్చి మొదటి వారంలో విడుదల కానున్నది. ప్రస్తుతం డ్రాగన్, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, అంఖే 2 చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat
amitabh bachchan queen elizabeth ii duke of edinburgh sarkar 3 uk india year of culture reception అమితాబ్ బచ్చన్ క్వీన్ ఎలిజబెత్ 2 డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ సర్కార్ 3 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్


Click it and Unblock the Notifications











