twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనవరాళ్లకు అమితాబ్ రాసిన లెటర్ ఇదే..ఎంత అద్బుతంగా ఉంది

    By Srikanya
    |

    ముంబై‌: అమితాబ్ బచ్చన్ కు ఇద్దరు మనవరాళ్లు..వాళ్లు నవ్య నవేరి, ఆరాధ్య. వాళ్లిద్దరికి ఆయన ఓ బహిరంగ లేఖ రాసారు. పేరుకు తమ మనవలను ఉద్దేశిస్తూ రాసినా అది దేశంలోని ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని ఆడపిల్లలందరినీ ఉద్దేసిస్తూ రాసినట్లుంది. నవ్య నవేరి అమితాబ్‌ బచ్చన్‌కుమార్తె శ్వేత బచ్చన్‌, నిఖిల్‌ నందాల కూతురు. అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ల గారాలపట్టియే ఆరాధ్య. వీరు తమ జీవితంలో ఎలా ఉండాలో, ఇతరులతో ఎలా మసలు కోవాలో మార్గనిర్దేశం చేశారు. ఆ బహిరంగ లేఖ ని క్రింద అందిస్తున్నాం. మీరు చదవండి..

    'మై డియరెస్ట్‌ నవ్య అండ్‌ ఆరాధ్య..!

    మీ మీ తాతలు హెచ్‌పీ నందా, హరివంశ బచ్చన్‌లు ఓ ఉన్నతమైన వారసత్వాన్ని ఇప్పటికే మీకు. అప్పగించారు. ఆ రెండు ఇంటిపేర్లే మీకు కీర్తి, గౌరవం, గుర్తింపు ఇచ్చాయి. అయినప్పటికీ మీరు అమ్మాయిలు కదా.. అందువల్ల ఈ సమాజం మీకు ఓ సరిహద్దును నిర్ణయిస్తుంది. మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. ఎలా ప్రవర్తించాలి. ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి అన్నది వారే నిర్ణయిస్తారు.

    ఈ చీకటి నీడల్లో మీరు బతకవద్దు. మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలంటే మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. 'మీ స్కర్ట్‌ ఎంత పొడవుండాలి? మీ స్నేహితులుగా ఎవరుండాలి? అనే విషయాలపై మీరే నిర్ణయం తీసుకోండి'. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని ఇతరులకు కల్పించొద్దు. మీరు కోరుకున్న వారితోనే పెళ్లి చేసుకోండి. ఇంకా ఏ ఇతర కారణంతోనూ పెళ్లికి తలూపవద్దు.

    Big B Writes A Beautiful Letter To His Granddaughters

    చాలా మంది ఎన్నో విషయాలు చెబుతుంటారు. అలాగని అవన్నీ మీరు వినాలని కాదు. ఏ విషయంపైనా కంగారు పడొద్దు. మీ మీ జీవితాల్లో జరిగిన సంఘటనలన్నింటికీ మీరే కర్త, కర్మ, క్రియ అనే విషయాన్ని మర్చిపోవద్దు.

    నవ్యా..! నీ ఇంటి పేరు నీకు ఇచ్చే అధికారాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు. అది నిన్ను ఎప్పటికీ రక్షించలేదు. ఎందుకంటే నువ్వు అమ్మాయివి కదా..!ఆరాధ్యా..! నువ్వు ఈ విషయాలన్నీ చదివి అర్థం చేసుకునే సమయానికి నేను ఈ లోకంలో ఉండక పోవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పేది మాత్రం నీకు కచ్చితంగా వర్తిస్తుంది.

    మీ పరిధులను మీరే నిర్ణయించుకోవడం కాస్త కష్టంగానే ఉండొచ్చు.అలాంటి ప్రపంచంలో మసలు కోవడం ఇబ్బందిగానే అనిపించొచ్చు. కానీ మీలాంటి వారివల్లే ఈ ప్రపంచం మారొచ్చని నేను నమ్ముతున్నాను. మీరు దీనినే ఆచరించండి. నేను సాధించిన దానికంటే ఇంకా ఎక్కువగానే మీరూ సాధిస్తారు. ఒక అమితాబ్‌ బచ్చన్‌గా కాకుండా మీ తాతగా ఈ ప్రపంచానికి పరిచయమవ్వడాన్ని నేను గర్వంగా భావిస్తాను.
    ఇట్లు..
    మీతాత... అమితాబ్ బచ్చన్

    English summary
    Amitabh Bachchan penned down a heartfelt letter to his granddaughters Navya Naveli and Aradhya. From talking about gender issues and how “make your own choices in the light of your own wisdom” and “never worry about log kya kahenge", this letter is spot on at a lot of levels.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X