»   » చిరు 150: హీరోయిన్లు అందుకే దూరమా? సంపూ లాంటోళ్లు..

చిరు 150: హీరోయిన్లు అందుకే దూరమా? సంపూ లాంటోళ్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ చేవెళ్ళ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు వివి వినాయక్ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్ గా తీర్చి దిద్దుతున్నారు. ముఖ్యంగా సినిమాలో కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్టు సిద్ధం చేసారు. సినిమాలో వెన్నెల కిషోర్, అలీ లాంటి స్టార్ కమెడియన్లతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇటీవలే అతడిపై టెస్ట్ షూట్ చేసారని, తాను అనుకున్న పాత్రకు సంపూ సరిపోవడంతో వినాయక్ అతన్ని కూడా చిరంజీవి 150వ సినిమాలో భాగం చేసారని, త్వరలోనే షూటింగులో సంపూ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయం ఇంకా అపీషియల్ గా ఖరారు కాలేదు. చిరంజీవితో నటించే అవకాశం దక్కాలని సంపూ ఎప్పటి నుండో ఆశ పడుతున్నాడు. ఇపుడు ఆ అవకాశం దక్కడంతో అదృష్టంగా ఫీలవుతున్నాడట.

కాగా ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవరనేది ఖరారు కాలేదు. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని సమాచారం. కేవలం పాటలు, కొన్ని సీన్లకే హీరోయిన్ ఉంటుందట. అందుకే స్టార్ హీరోయిన్లు సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదట. పైగా చిరు లాంటి ఏజ్డ్ స్టార్ తో చేస్తే ఫాంలో ఉన్న యంగ్ హీరోలతో అవకాశాలు తగ్గిపోతాయనే భయంలో ఉన్నారట. హీరోయిన్ దొరకని సమస్య కారణంగానే ఇందుకు సంబంధించిన సీన్లు చివరి షెడ్యూల్ లో ప్లాన్ చేసారు. ఈలోగా మిగతా షెడ్యూల్ పూర్తి చేస్తూ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.

కత్తిలాంటోడు కాదు

కత్తిలాంటోడు కాదు

తమిళ సినిమా ‘కత్తి'కి రీమేక్ కాబట్టి తెలుగు టైటిల్ ‘కత్తిలాంటోడు' అనే ప్రచారం జరిగింది. రీసెంట్ గా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ..కత్తిలాంటోడు టైటిల్ ని ఫైనలైజ్ చేయలేదని అన్నారు.

టైటిల్ ఆలోచన

టైటిల్ ఆలోచన

సెంటిమెంట్స్ ని బాగా నమ్మే వినాయిక్ ..ఈ చిత్రానికి ఖైదీ నెంబర్ 786 (చిరంజీవి సూపర్ హిట్ చిత్రం) తరహాలో 'ఖైదీ నెంబర్.150'అని పెడదామని అనుకుంటున్నారట. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖైది. అలాగే ఖైదీ నెంబర్ 786 కూడాను.

ఆకుల శివ

ఆకుల శివ

చిరంజీవి 150వ సినిమా కాబట్టి అభిమానులు చిరంజీవి పోలిటికల్ ఇమేజ్ కు తగ్గట్టుగా సందేశాత్మకమైన మాటలను కూడా ఆశిస్తారు. అందుకే ఆలోటు తీర్చేందుకు సాయి మాధవ్ ను రంగంలోకి దించినట్లు చెప్తున్నారు.

విజయశాంతి కూడా?

విజయశాంతి కూడా?

చిరంజీవి 150వ సినిమాలో విజయశాంతితో కూడా ఓ ప్రత్యేక పాత్ర ఆమెతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary
There is a lot of speculation and excitement about Megastar Chiranjeevi's 150th film, as not much is known about it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu