TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బిగ్ సర్‌ప్రైజ్: వినయ విధేయ రాముడి కోసం తారక రాముడు.. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలని నిర్వహించబోతోంది. బుధవారం రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. బోయపాటి, చరణ్ కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఇదిలా ఉండగా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చే ముఖ్య అతిథి విషయంలో అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.
|
చీఫ్ గెస్ట్‌గా తారక రాముడు
వినయ విధేయ రామ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ వేడుకకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాంచరణ్, కేటీఆర్ కు మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉంది.
ఇప్పటికే ఒకసారి
రాంచరణ్ సినిమా ఈవెంట్ కు కేటీఆర్ హాజరు కానుండడం ఇది రెండవ సారి. ఆయన ఇప్పటికే ధృవ చిత్రానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు సందర్భాల్లో కేటీఆర్ నాకు ఫ్రెండ్ అని రాంచరణ్ చెబుతుంటాడు. ఇటీవల తెలంగాణ ఎన్నికలో టిఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంలో కూడా రాంచరణ్ కేటీఆర్ ని ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే.
800 మంది డాన్సర్స్.. షాకిచ్చేలా రాంచరణ్ సినిమా.. ఖర్చు ఊహకందని విధంగా!
బోయపాటి శైలిలో
దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకునే ఆయన సినిమాలు తీశారు. వినయ విధేయ రామ చిత్రంలో కూడా రాంచరణ్ ని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో రాంచరణ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ భామ కైరా అద్వానీ గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ కానుంది.
డివివి దానయ్య నిర్మాణంలో
రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న దానయ్యే వినయ విధేయ రామ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా రాంచరణ్‌కు ధీటైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ స్నేహ చాలా కాలం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.