twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్, మా టార్గెట్ అదే అని స్పష్టీకరణ!

    |

    'బిగ్ బాస్ తెలుగు2' రియాల్టీ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కౌశల్ షో విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆయన్ను అభిమానించే ఫ్యాన్స్ అంతా కౌశల్ ఆర్మీగా ఏర్పడ్డారు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అభిమానులను కలుస్తున్నారు.

    కౌశల్ ఆర్మీ, ప్రభాస్ ఫాన్స్ మధ్య వార్.. కారణం ఇదే!కౌశల్ ఆర్మీ, ప్రభాస్ ఫాన్స్ మధ్య వార్.. కారణం ఇదే!

    విజయ యాత్రలో భాగంగా కర్నూలు వెళ్లి అక్కడి అభిమానులను కలిసిన అనంతరం కౌశల్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కౌశల్ ఆర్మీ సపోర్టుతో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

    కౌశల్ ఆర్మీ ఫౌండేషన్

    కౌశల్ ఆర్మీ ఫౌండేషన్

    ఇటీవలే తాను కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని, ఇండియాలో బెస్ట్ ఎన్జీవోగా దీన్ని తీర్చిదిద్దాలనేది తన లక్ష్యమని తెలిపారు. ఇందు కోసం తమ శక్తిమేర ప్రయత్నిస్తామని వెల్లడించారు.

    శ్రీకాకుళంలో గ్రామం దత్తత

    శ్రీకాకుళంలో గ్రామం దత్తత

    ఈ ఫౌండేషన్ మొదలు పెట్టిన తర్వాత శ్రీకాకుళం వరద బాధితులకు సహాయం చేయడంలో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని వారికి సహాయం చేయాలనుకుంటున్నామని కౌశల్ తెలిపారు.

    ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

    ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం

    త్వరలోనే కౌశల్ ఆర్మీ సభ్యులతో కలిసి శ్రీకాకుళం వెళ్లబోతున్నట్లు తెలిపిన కౌశల్ అక్కడి నుంచి తమ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే ఈ ఆర్మీ లక్ష్యమన్నారు.

    Recommended Video

    Bigg Boss 2 Fame Bhanu Sri In Yedu Chepala Katha Movie
     రాజకీయాల్లో వస్తారా?

    రాజకీయాల్లో వస్తారా?

    సహాయం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికీ కౌశల్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజా సేవ చేయడం కోసమే. ఆ ప్రజా సేవ అనేది రాజకీయాల్లోకి రాకుండా కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి రాజకీయ అరంగ్రేటం గురించి ఏమీ ఆలోచించడం లేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఉంటే తప్పకుండా చెబుతానన్నారు.

    English summary
    Bigg Boss 2 Telugu Winner Kaushal recently started Kaushal Army Foundation. This voluntary Foundation will be adopted and developed Thophan affected village in Srikakulam district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X