For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన అలీ రెజా.. ఆ దర్శకుడి చిత్రంలో చాన్స్.. ఇక దశ తిరిగినట్టే

  |

  బిగ్‌బాస్ షోతో ఫుల్ పాపులార్టీ తెచ్చుకున్న కంటెస్టెంట్ అలీ రెజా. బుల్లి తెర సీరియల్స్‌తో ఇంటిల్లి పాదిని అలరించిన అలీ.. అడపాదడపా చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు. ధృవ సినిమాలో రామ్ చరణ్ పక్కన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. బుల్లితెర ధారావాహికల ద్వారా వచ్చిన ఫేమ్‌తో అతనికి బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చింది. షో మొదట్లో ఎక్కువగా అంచనాలు లేకపోయినా వారం వారం గడుస్తున్న కొద్దీ అతనిపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తన కోపంతో బుల్లితెర అర్జున్ రెడ్డి అంటూ ఓ ముద్రను వేయించుకున్నాడు.

  నామినేషన్ ఎరుగని కంటెస్టెంట్..

  నామినేషన్ ఎరుగని కంటెస్టెంట్..

  మూడో సీజన్ ప్రారంభమైన తరువాత మొదటి రెండు వారాలు గడుస్తూ వెళ్లగా షోపై మెల్లి మెల్లిగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. నామినేషన్‌లోకి వెళ్లకుండా అందరి మనసుల్ని గెలుచుకున్న అలీ.. బయట అభిమానాన్ని మాత్రం సంపాదించుకోలేకపోయాడు. నామినేషన్‌లోకి వచ్చిన మొదటి సారే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు.

  అనూహ్యంగా రీఎంట్రీ..

  అనూహ్యంగా రీఎంట్రీ..

  ఇక అక్కడితో బిగ్‌బాస్‌తో సంబంధం తెగిపోయిందనుకుంటోన్న తరుణంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అలీ ఎలిమినేషన్ తరువాత అతని తిరిగి ఇంట్లోకి పంపించాలని ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో చేసిన ప్రచారం మేరకు హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో షో మరో లెవెల్‌కు వెళ్తుందనుకున్న నిర్వాహకులకు పెద్ద షాకే తగిలింది.

  మునుపటి అలీ మిస్..

  మునుపటి అలీ మిస్..

  ఎలిమినేట్ అయిన అలీ మళ్లీ రీఎంట్రీ ఇస్తే షో మళ్లీ ఓరేంజ్‌లో నడుస్తుందని అనుకున్నారు. కానీ అతను తిరిగి వచ్చాక పూర్తిగా చప్పబడిపోయాడు. అలీలో ఉన్న ఆ మునుపటి అగ్రెసివ్‌నెస్ పూర్తిగా కానరాకుండా పోయింది. మిగతా కంటెస్టెంట్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండసాగాడు. ఒకానొక దశలో అమ్మలక్కల ముచ్చట్లు పెడుతున్నావ్ అంటూ నాగ్ కూడా ఫైర్ అయ్యాడు.

   టాప్5లో నిలిచిన అలీ..

  టాప్5లో నిలిచిన అలీ..

  హ్యూమన్ బుల్‌డోజర్‌గా ఫేమస్ అయిన అలీ టాస్క్‌ల వరకు పర్‌ఫెక్ట్‌గా ఆడేవారు. కొన్ని సార్లు కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించి బొక్క బోర్లా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరూ ఊహించినట్టుగానే అలీ రెజా టాప్ 5లో నిలిచాడు. టాప్ 5లో అయితే నిలిచాడు కానీ విన్నర్ అయ్యేంత అభిమానాన్ని మాత్రం సంపాదించుకోలేకపోయాడు. రీఎంట్రీ ఇచ్చాడన్న కారణంతో అలీని అంతగా పట్టించుకోలేదు.

  హౌస్‌లో ఏర్పడిన బంధాలు..

  బిగ్‌బాస్ హౌస్‌లో టైటిల్ గెలవలేకపోయినా.. అందరితో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. శివజ్యోతి, రవికృష్ణ, వితికా, రాహుల్, వరుణ్ సందేశ్, పునర్నవిలతో కలిసిపోయాడు. పునర్నవి, వరుణ్, వితికాలతో కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

  #CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
   లక్కీ చాన్స్ కొట్టేసిన అలీ..

  లక్కీ చాన్స్ కొట్టేసిన అలీ..

  అలీ రెజాకు వెండితెరతో పరిచయమున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రంలో మంచి పాత్రను పోషించబోతోన్నాడు. మరాఠా చిత్రమైన నట సామ్రాట్ చిత్రాన్ని కృష్ణవంశీ రంగమార్తాండగా తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలీ ఓ క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు, ఫస్ట్ డే షూట్‌కు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కృష్ణ వంశీ లాంటి దర్శకుల చేతిలో పడితే దశ తిరిగినట్టేనని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Bigg Boss 3 Telugu Fame Ali Reza Is Acts In Rangamarthanda. Which Is Directed By Krishna Vamsi Is Originally Taken From Marati Nata Samrat Movie. Prakash Raj Ramya Krishnan And Brahmanandam Are Playing Important Characters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X