»   » బిగ్‌బాస్ విన్నర్ అతని తొడని కొరికాడు, నటికోసమే ఇద్దరి గొడవ

బిగ్‌బాస్ విన్నర్ అతని తొడని కొరికాడు, నటికోసమే ఇద్దరి గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇద్దరు కన్నడ బుల్లితెర నటుల మధ్య చెలరేగిన గొడవ రచ్చకెక్కింది షూటింగ్ లో ఇద్దరి మధ్యా చెలరేగిన వివాదం ముదిరి పోలీస్ కేసుల వరకూ వెళ్ళింది. . ఇటీవల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయిన నటుడు ప్రథమ్‌ తాజాగా ఒక సీఇయల్ లో తన సహ నటుడు భువన్‌ తొడను కొరికి మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.

తొడను కొరికి

తొడను కొరికి

‘నంజు మత్తు నాను' టీవీ సీరియల్‌ సెట్‌లో ఓ నటి విషయంలో వారిద్దరు గొడవపడి అది తారా స్తాయికి చేరుకోవటం తో ఒకరిని ఒకరు కొట్టుకునేదాకా వెళ్ళిందట. ఈ సంఘటనపై భువన్‌ ఆదివారం రాత్రి తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరి వివాదం అక్కడ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Big Boss Telugu Episode- 3: Adarsh Behaved Like An Alcohol Addict
లేనిపోని ఆరోపణలు

లేనిపోని ఆరోపణలు

భువన్‌ను ఓ సీరియల్‌ నుంచి తొలగించడం వల్లే ఆ కోపం లో తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ప్రతీసారీ తనతో గొడవకు దిగుతున్నాడనీ ప్రథమ్‌ చెప్పాడు. భువన్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఆదివారం షూటింగ్‌ ముగిసిన తర్వాత గదిలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అక్కడ సంజన, భువన్‌ ఉన్నారని, మధ్యలో వచ్చిన తనను చూసిన అతడు ఆగ్రహంతో దూషించాడని చెప్పిన ప్రథమ్‌.

కన్నడ బిగ్‌బాస్‌ 4 విజేత

కన్నడ బిగ్‌బాస్‌ 4 విజేత

ఓ విషయంలో భువన్‌ను సీరియల్‌ నుంచి తొలగించారని అదే తన మీద కోపానికి కారణమైందనీ చెప్పాడు. కన్నడ బిగ్‌బాస్‌ 4 విజేత అయిన ప్రథమ్‌ గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు.

ఆత్మహత్యకు యత్నించి

ఆత్మహత్యకు యత్నించి

తన స్నేహితుడు లోకేశ్‌ తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నానంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రథమ్‌ను సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రకం వివాదం తో వార్తలకెక్కాడు. ఈ ఇద్దరి వల్లా ఇప్పుడు నిర్మిస్తున్న సీరియల్ లో కూడా అవాంతరాలు తలెత్తుతున్నాయట.

English summary
Kannada television world witnessed a physical fight, and that too one where an actor ended up biting his co-actor. Sounds bizarre?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu