»   » హైదరాబాద్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన భారీ కటౌట్లు

హైదరాబాద్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన భారీ కటౌట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న ఐదుగురిలో నటి అర్చన ఒకరు. ఈ ఐదుగురు సభ్యుల్లో బిగ్ బాస్ ఇంట్లో నెగెటివ్ అంశాలతో హాట్ టాపిక్ అయిన వ్యక్తి. ఇంటి నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే.

అంతే కాదు.... బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో నస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమెపై సోషల్ మీడియాలో కూడా చాలా సెటైర్లు వేస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవల మీమ్స్ రూపంలో వాటిని ఆమెకు బిగ్ బాస్ చూపించడంతో షాకైన సంగతి తెలిసిందే. వాస్తవానికి అర్చన ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారు ప్రేక్షకుల ఓటింగులో ఆమె నిలబడుతూ ఫైనల్ వరకు చేరుకున్నారు.

హైదరాబాద్ లో భారీ కటౌట్లు

హైదరాబాద్ లో భారీ కటౌట్లు

బిగ్ బాస్ సీజన్ విన్నర్ అవ్వాలంటే ప్రేక్షకుల ఓటింగ్ తప్పనిసరి కాబట్టి ఆమెకు సంబంధించిన వారెవరో కొందరు.... హైదరాబాద్ లో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అర్చనకు ఓటు వెయ్యాలని, బిగ్ బాస్ విజేతగా నిలపాలని ఆ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమాక్స్ తో పాటు హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి.

అర్చన గెలిచే అవకాశం ఉందా?

అర్చన గెలిచే అవకాశం ఉందా?

అర్చన బిగ్ బాస్ విన్నర్ అవుతుందా? లేదా?.... ఇంకెవరైనా విజేతగా నిలుస్తారా? అనేది ఈ రోజు జరిగే ఫైనల్ ఈవెంటులో తేలనుంది. బిగ్ బాస్ విజేత ఎవరు అవుతారు? మీరు ఎవరి సపోర్టు చేస్తున్నారు? అనేది కామెంట్ బాక్సులో వెల్లడించండి.

అర్చన మీద సోషల్ మీడియాలో సెటైర్లు

అర్చన మీద సోషల్ మీడియాలో సెటైర్లు

ఆ మధ్య అర్చన మదర్ బిగ్ బాస్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అర్చన చాలా ఎమోషనల్ అయింది. అయితే దీన్ని ఫన్నీగా మార్చి కొందరు ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేశారు. ఎలాగూ వచ్చారు కదా మీ పాపని తీసుకెళ్లిపోండి ఆంటీ అంటూ ఓ పోస్టు పెట్టారు. నేను భావోద్వేగానికి గురైతే ఇలా చేశారు ఏంటి? అర్చన కాస్త ఫీలైంది.

హరికథ చెప్పడం అంటే...

హరికథ చెప్పడం అంటే...

హరికథ చెప్పడం అంటే హరితేజ మీద చాడీలు చెప్పినంత ఈజీ కాదమ్మా... అంటూ అర్చన మీద మరో సెటైర్ పడింది.

గబ్బు మెకంది అంటూ ఫన్నీగా

గబ్బు మెకంది అంటూ ఫన్నీగా

షో స్టార్ట్ అయిందో లేదో... గొడవ స్టార్ట్ చేస్తుంది గబ్బు మొకంది అంటూ.... కొందరు ఫ్యాన్స్ ఫన్నీ సెటైర్లు వేశారు.

గుడ్డు లేకుంటే ఏడుస్తా

గుడ్డు లేకుంటే ఏడుస్తా

గుడ్డు లేకుంటే నేను ఏడుస్తా... అంటూ అర్చనను ఉద్దేశించి క్రియేట్ చేసిన మరో సెటైర్.

వారం పాటు అలాగే ఉంచాలి

వారం పాటు అలాగే ఉంచాలి

వారం పాటు అర్చనను ఇంట్లో అలాగే ఫ్రీజ్ చేస్తే బావుంటుంది అంటూ కొందరు అభిమానులు సెటైర్లు వేశారు.

English summary
The Bigg Boss first season is coming to an end now. Already there are too many twists and turns that we have witnessed in the TV show. The latest is that there are cutouts being erected for Archana, who is one of the strong contestants in the TV show to grab the finale title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu