»   »  ‘బిల్లా-రంగ’విడుదల తేదీ ఖరారు

‘బిల్లా-రంగ’విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వాక్ కార్ప్ పతాకంపై ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశిరెడ్డి సుధీర్ రెడ్డి రూపొందించిన 'బిల్లా-రంగ' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. రాహుల్ వెంకట్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించింది.


దర్శకుడు మాట్లాడుతూ.,...మాట్లాడుతూ- తమిళంలో మంచి పేరున్న సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తొలిసారిగా తెలుగులో ఈ చిత్రానికి అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రెండ గంటలపాటు ప్రేక్షకులను అలరించే ఈ చిత్రంలో ప్రేమ, కెరీర్ అన్న అంశాలపై విశే్లషణాత్మక కథనం ఉంటుందని తెలిపారు. ఈ నెల 21న విడుదలకానున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాకు మంచి నిర్మాతలు దొరికారు. సత్యానంద్‌గారు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందిని తెలిపారు.

Billa Ranga Releasing On 21st February

సత్యానంద్ మాట్లాడుతూ "ఇందులో నటించడానికి నా శిష్యుడు మహేంద్ర చక్రవర్తి కారణం. అందరికీ నచ్చే పాత్ర చేశాను. దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు నచ్చింది. పాటలు బాగా కుదిరాయి'' అని అన్నారు. రాహుల్ వెంకట్ మాట్లాడుతూ "నా తొలి సినిమాకు భిన్నంగా ఉంటుందీ సినిమా. సంతోష్ నారాయణన్ ఎనర్జిటిక్ పాటలిచ్చారు'' అని తెలిపారు.


చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది అని నిర్మాతలు చెప్పారు. మంచి పాటలు కుదిరాయని స్వరకర్త సంతోష్ నారాయణన్ అన్నారు. జీవా, గౌతమ్‌రాజు, చరణ్, వేణు, వెనె్నల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్.వి.విశేవశ్వర్, సంగీతం:సంతోష్ నారాయణన్, పాటలు:వశిష్ఠ శర్మ, ఎడిటింగ్:చంద్రశేఖర్, నిర్మాతలు:అరవింద్ వన్నాల, వంశీబోయిన, కాశిరెడ్డి సుధీర్ రెడ్డి, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.

English summary

 'Billa Ranga' a new film by all rookie makers Vamsy Boyina, Arvind Vannala and Kasireddy Sudheer Reddy producing on the banner Sky-Vak Corporation and directed by Pradeep Madugula. The film has Rahul Venkat, Pradeep Bento and Rishika in the lead roles and ace acting trainer Satyanand playing a special role. The film was given a U/A certificate by the Censor and the producers are planning to release the film on the 21st February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu