For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara Pre Release Event: దర్శకుడు దుర్మార్గుడు.. బింబిసార బడ్జెట్‌పై కెమెరామెన్ కామెంట్

  |

  నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. నందమూరి అభిమానుల మధ్యలో నందమూరి హీరోలు కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక హైదరాబాదులో జరిగిన ఆ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా రావడం హైలెట్ గా నిలిచింది. అయితే ఈ వేడుకలో కొందరు మాట్లాడిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కెమెరామెన్ చోటా కె నాయుడు, దర్శకుడు వశిష్ట్ వారి మాటలతో ఎంతో ఆకట్టుకున్నారు.

  కెమెరామెన్ చోటా కె నాయుడు మాట్లాడుతూ

  కెమెరామెన్ చోటా కె నాయుడు మాట్లాడుతూ

  నేను ఎన్నో సినిమా ఈవెంట్స్ లలో చాలామంది అభిమానుల మధ్యలో చూశాను. అయితే ఇలాంటి తరహా ఎనర్జి తో వచ్చితో ఫ్యాన్స్ ను ఎప్పుడు చూడలేదు. ఎన్టీఆర్ ఏవి వేసినప్పుడు మీరు ఇచ్చిన 15 నిమిషాల ఎనర్జీకి నేను ఆశ్చర్యపోయాను. అలాగే మీ ఎనర్జి కి తగ్గట్టుగానే ఈ బింబిసార సినిమా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మీరు చూసిన కళ్యాణ్ రామ్ వేరు బింబిసారలో చూసే కళ్యాణ్ రామ్ వేరు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చింపి పడేసాడు అని అన్నారు.

  గర్వపడే సినిమా

  గర్వపడే సినిమా

  ఆగస్టు 15 తర్వాత మీరు తప్పకుండా గర్వపడే సినిమా అవుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక విశ్వరూపం చూపించాడు. ఒక విధంగా కళ్యాణ్ రామ్ ఎలాంటి మాటలు చెప్పినా కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. సినిమాలో ఐటెం సాంగ్ చేసినప్పుడు కూడా చాలా సిగ్గుపడ్డాడు. ఆ హాట్ సాంగ్ లో కూడా ఆయన చాలా సిగ్గు పడిపోయాడు. కానీ ది బెస్ట్ హీరో అని నేను చెప్పగలను. ఈ సినిమా ద్వారా అతనితో నేను మొదటిసారి పనిచేశాను.

   కష్టపడి సినిమా చేశాడు

  కష్టపడి సినిమా చేశాడు

  ఇక ఈ సినిమాకు వర్క్ చేసిన వశిష్ట చాలా కఠినమైన షాట్స్ పెట్టినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ ఎంతో కష్టపడి చేశాడు. ఒక పెద్ద కేవ్ లో నుంచి కళ్యాణ్ రామ్ పడాలి అన్నప్పుడు చాలా ధైర్యంగా ఆ సీన్లల్9 నటించాడు. నేను అప్పుడు ఆ 12 షాట్లకు షాక్ అయిపోయాను. అసలు సీన్స్ నటించడానికి దాదాపు 25 సార్లు కింద పడాల్సి వచ్చింది. అతన్ని చూసి నేను గర్వపడుతున్నాను.

  దర్శకుడు దుర్మార్గుడు

  దర్శకుడు దుర్మార్గుడు

  ఇక దర్శకుడు గురించి చెప్పాలి అంటే అతను ఒక దుర్మార్గుడు అంటూ చాలా ప్రేమగా చెప్పారు. ఇతను ఎంత దుర్మార్గుడు అంటే కళ్యాణ్ రామ్ గారిని ఒక చేతిలో అలాగే నిర్మాత హరి గారిని మరొక చేతిలో పెట్టుకుని ఇద్దరినీ గుప్పెట్లో పెట్టుకుని సినిమాను పూర్తి చేశాడు. నేను అసలు ఊహించలేదు. ఎవరైనా సరే కొత్త డైరెక్టర్ కి ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇలా ఉండరు. కానీ వశిష్ట మాత్రం వర్క్ చేసిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతను కేవలం దర్శకుడుగా కాకుండా ఒక ఒక సెట్ అసిస్టెంట్ గా మేకప్ అసిస్టెంట్ గా ఇలా ఎన్నో రకాల పనులు చేస్తాడు. కొత్త దర్శకుడు ఎలా ఉండాలో అతని చూసి నేర్చుకోవాలి.

  సినిమా బడ్జెట్

  సినిమా బడ్జెట్

  ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాత హరి. సినిమాకు ఒక 40, 50 కోట్లు పెడితే ఆ 50 కోట్లు స్క్రీన్ పై కనపడాలి అంటే మా హరిని చూసి నేర్చుకోవాలి. ప్రతి సన్నివేశం కోసం కూడా అతను చూపించిన డెడికేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో షూట్ చేసిన ప్రతి ఒక్కటి కూడా వెండి తెరపై చూస్తారు.. అని ఈ విషయంలో హరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని చోటా కె వివరణ ఇచ్చారు.

  దర్శకుడు విశిష్ట మాట్లాడుతూ..

  దర్శకుడు విశిష్ట మాట్లాడుతూ..

  ఇక్కడికి వచ్చిన నందమూరి ఫ్యాన్స్ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ముందుగా విడుదల చేసిన టీజర్ ట్రైలర్ అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ విని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మత గారికి అలాగే కళ్యాణ్ రామ్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఎంతో బాగా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కరి పనితనం కూడా కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది.. అని అన్నారు

  English summary
  Bimbisara pre release event cameraman chota k naidu and director vassishta speech
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X