»   » రవిబాబుతో 'ప్రతి రోజు' బిందుమాధవి

రవిబాబుతో 'ప్రతి రోజు' బిందుమాధవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆవకాయ బిర్యాని చిత్రంతో పరిచయమైన బిందుమాధవి బంపర్ ఆఫర్ చిత్రంతో క్లిక్ అయింది. తాజాగా ఆమె రవి బాబు సరసన ఓ చిత్రంలో చేస్తోంది. ప్రకాష్‌ వి.ప్రొడక్షన్స్‌ సంస్థ పై నాగేందర్‌ వి నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ప్రతి రోజు' అనే పేరుని ఖరారు చేశారు..ఈ చిత్రానికి రాజు రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "విభిన్నమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. త్వరలో విడుదల చేస్తామన్నారు. "ప్రతి రోజు అనే పేరుకీ, కథకీ ఉన్న సంబంధం ఏమిటనేది తెర మీద చూడాలి. రవిబాబు నటన ప్రధాన ఆకర్షణ" అన్నారు దర్శకుడు. చలపతిరావు, ఎమ్మెస్‌ నారాయణ, హేమ, జయప్రకాష్ ‌రెడ్డి, ఆయేషా జలీల్‌ తదితరులు నటించారు. సంగీతం: శామ్‌ప్రసేన్‌, ఛాయాగ్రహణం: వంశీ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu