»   » వేశ్యగా మారినా బిందు మాధవికి కలిసిరాలేదు

వేశ్యగా మారినా బిందు మాధవికి కలిసిరాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అచ్చమైన తెలుగు అమ్మాయి అనే ముద్రతో ఆవకాయ బిర్యాని చిత్రంతో పరిచయమైన బిందు మాధవి ఎంతో కాలం హైప్ క్రియేట్ చేయలేకపోయింది. మొదట సినిమా అటూ ఇటూ ఆవటంతో ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత చేసిన బంపర్ ఆఫర్ ఫరవాలేదనిపించుకున్నా ఆమె కు అస్సలు ఉపయోగపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె హీరోయిన్స్ కెరీర్ చివరి దశలో వేసే వేశ్యా వేషానికి రెడ అయిపోయింది. రీసెంట్ గా విడుదలైన నాని చిత్రం సెగ ఆమె వేశ్యగా కనిపించింది.

కానీ ఆ సినిమా కూడా బిందు మాధవికి గుర్తింపు తేలేకపోయింది. దాంతో ఆమె ఓ విధమైన నిరాసక్తకు లోనైంది. ఎంతో ఆశలుపెట్టుకున్న ఆ చిత్రం హిట్టైతే స్టార్ హీరోయన్ గా వేషాలు రాకపోయినా నటిగా నిలదొక్కుకోవచ్చని ఆమె నమ్మకం పెట్టుకుంది.అయితే మొదటి రోజు మార్నింగ్ షోకే ఆ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తమిళంలోన అదే పరిస్ధితి. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లయింది బిందు మాధవి ప్రస్తుత పరిస్ధతి.

English summary
Actress Bindu Madhavi, is doing the role of a sex worker in the Sega film. Directed by Anjana, a disciple of Gautham Menon, the film is said to be a realistic portrayal of the lives of slum dwellers, prostitutes and the underdog.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu