»   » రిలీజ్ కాకముందే ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఎలా

రిలీజ్ కాకముందే ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఎలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'హమ్‌షకల్‌' చిత్రం ప్రచారానికి బాలీవుడ్‌ భామ బిపాసాబసు దూరంగా ఉండటంపై కొన్ని రోజులుగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి షాజిద్‌ఖాన్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని మరో నటి తమన్నా పాత్రకు దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బిపాసాకు నచ్చక పోవడం వల్లనే ఇలా చేస్తోందని, దర్శకుడితో అభిప్రాయ భేదాలు రావడం వల్లనేనని రకరకాలుగా వినిపిస్తోంది. వాటన్నింటికీ తెరదించుతూ బిపాసా ఓ ట్వీట్‌ని పోస్ట్‌ చేసింది.

Bipasha Basu: Certain journeys cannot be completed

సినిమా పూర్తయ్యాక అందులో తన పాత్ర అసంతృప్తిని మిగిల్చడమే కారణమని చెబుతోంది. 'నేను ఏ సినిమా అంగీకరించినా పూర్తి బాధ్యతతో పనిచేస్తాను. ఈ సినిమా అలాగే చేశాను. డబ్బింగ్‌ పూర్తయ్యాక సినిమా చూసి నా మనసు కలత చెందింది. దీనికి ఎవర్నీ నిందించడం లేదు. కొన్ని ప్రయాణాలు ఇలాగే ముగుస్తుంటాయి. అందుకే ప్రచారానికి దూరంగా ఉన్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నాకు 'రాజ్‌3' విజయాన్ని అందించిన సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. వారి ఖాతాలో మరో విజయం చేరాలని ఆకాంక్షిస్తున్నాను' అని చెప్పింది.

ఇటీవల జరిగిన ఓ పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు షాజిద్‌ఖాన్‌ని బిపాసా ప్రచారానికి రాలేకపోవడానికి కారణం అడగ్గా 'ఆ సంగతి నాకంటే ఆమెకే బాగా తెలుసు'అని చెప్పారు. ఇప్పుడు బిపాసా ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో ఆమె సినిమా బాగా వచ్చిందని చెప్తున్నట్లు లేదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నట్లుంది. రిలీజ్ కాకముందే ఇలాంటి ట్వీట్స్ చేస్తే ఎలా అంటోంది బాలీవుడ్.

English summary
Bipasha Basu said: “This is to put an end to all the discussions around my absence for Humshakals promotions. I take full responsibility of getting into a film only on the basis of trust. But after dubbing for my character in the film, as I had professionally committed to do so I’m extremely disturbed by the end result of the same.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu