»   »  బికినీ గోల: తమన్నాపై బిపాసా గుర్రు...! (పిక్చర్స్)

బికినీ గోల: తమన్నాపై బిపాసా గుర్రు...! (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకుని దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో 'హమ్‌షకల్స్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు బాలీవుడ్ భామలు బిపాసా బసు, ఇషా గుప్తా కూడా నటిస్తున్నారు.

అయితే దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు కూడా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలకంటే తమన్నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై బిపాసా మండి పడుతోంది. సీనియర్లను వదిలేసి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని గుర్రుగా ఉందట. 'హమ్‌షకల్స్' సినిమా ప్రమోషన్లకు కూడా తమన్నానే ఎంచుకోవడం ఆమె కోపానికి మరో కారణం.

మరో వైపు ఈ చిత్రంలో తమన్నా ఇష్టప్రకారమే నడుచుకుంటున్నాడు దర్శకుడు. ఓ సీన్లో సినిమాలోని ముగ్గురు భామలు బికేనీ వేయాల్సిఉంది. అయితే తమన్నా బికినీ వేయనని చెప్పడంతో....ఆమెతో షార్ట్ వేయించి, మిగతా ఇద్దరినీ బికినీలో చూపించారు. ఈ రేంజిలో తమన్నాకు ప్రాధాన్యత ఇవడం వెనక....రకరకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తమన్నాకు, దర్శకుడికి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలుకూడా ఆ మధ్య వినిపించిన సంగతి తెలిసిందే.

బికినీ వేయను

బికినీ వేయను


'నిజానికి, మేము ముగ్గురమూ బికినీలు వేసుకొని, నీళ్ళలో నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుంటే, ఆ దృశ్యాన్ని చిత్రీకరించాలని దర్శకుడు సాజిద్ అనుకున్నారు. కానీ, బికినీ వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పటి లానే ఆ మాట మీదే నిలబడ్డాను. చివరకు షార్ట్స్ వేసుకొని, పైన షార్ట్ టాప్ వేసుకొని ఆ దృశ్యంలో నటించాను' అని తమన్నా చెప్పారు.

సైఫ్ అలీ ఖాన్‌తో

సైఫ్ అలీ ఖాన్‌తో


తాజా చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌తో కలసి నటిస్తున్న తమన్నా, ఆయనతో కలసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. నిజ జీవితంలో కూడా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి చక్కటి జంటను నేను చూడలేదు అని చెబుతోంది.

హమ్ షకల్స్

హమ్ షకల్స్


హమ్ షకల్స్ చిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా విష్ణు భగ్నానీ నిర్మిస్తున్నారు. పర్హాద్, సాజిద్ ఖాన్ సంయుక్తంగా స్టోరీ అందించారు.

ప్రధాన తారాగణం

ప్రధాన తారాగణం


ఈ చిత్రంలో సైఫ్ అలీ కాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్, బిపాసా బసు, తమన్నా, ఇషా గుప్తా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary

 Bollywood starlet, Bipasha Basu is fuming over milky beauty Tamanna. The reason for her anger is that the entire unit of her latest film Humshakals has been giving Tamanna more priority over her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu