»   »  బిపాసా తీరని కోరిక

బిపాసా తీరని కోరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bipasha
బాలీవుడ్ హాట్ స్టార్ బిపాసా బసు ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ ముముట్టి తో నటించాలని ఉత్సాహపడుతోందిట.ఎప్పటినుంచో ఉన్న ఆమె తీరని కోరికట ఇది. మొన్న కేరళలోని కొచ్చిలో గల ఓ ప్రైవేటు పంక్షన్ కి అటెండు అయినపుడు మనసులో మాట ఇలా బయిట పెట్టింది. ఆమె సోదిరి భర్త కేరళవాసి కావటంతో మలయాళం మాట్లాడాల్సి వచ్చేదిట.దాంతో సరదాగా అక్కడ సినిమాలు చూడటం, మలయాళం ప్రాక్టీస్ చేసిందిట. దాంతో మలయాళ భాష దేముడెరుగు గాని ముముట్టి సినిమాలు చూసి చూసి ఆయన స్టైల్ కి ఫ్యాన్ అయిందిట.కాబట్టే ముముట్టి తో కలిసి నటించాలని సరదాపడుతోందిట.విషయం బాగానే ఉంది గాని కత్రినా కైఫ్ 'మోనికా అండ్ ది డాన్' అనే మలయాళ చిత్రంలో నటించినప్పటినుంచే ఈ కోరిక బిపాసా బసు కి పుట్టిందంటూ కామెంట్లు వస్తున్నాయి.ఇదీ నిజమే కావచ్చు. ఎందుకంటే సినిమావాళ్ళు కథలు వినీ వినీ చెప్పటం చాలా ఈజీ గా మారిపోతుందట.

Read more about: bipasha mammootty kerala mumbai
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X