»   » ఫోటోలతోనే నోరూరిస్తున్న కార్తి ‘బిరియాని’(ఫోటోలు)

ఫోటోలతోనే నోరూరిస్తున్న కార్తి ‘బిరియాని’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో కార్తీ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆచిత్రం పేరు 'బిరియానీ'. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానున్న ఈచిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక హీరోయిన్. తమిళ నటుడు ప్రసన్న, నీతు చంద్ర, స్నేహ, రాంకీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు అందించారు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇది వందో సినిమా. ఈనెల 6న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేయనున్నారు.

తాజాగా విడుదలైన ఈచిత్రం పోటోలు విడుదలకు ముందే సినిమాపై ప్రేక్షకులకు నోరూరేలా చేస్తున్నాయి. ఇందులో కార్తి, హన్సిక లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండటం చర్చనీయాంశం అయింది. గత సినిమాల కంటే కార్తీని దర్శకుడు వెంకట్ ప్రభు మరింత స్టైలిష్ గా చూపిస్తాడని ఈ పోస్టర్లు చూస్తే స్పష్టం అవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అవబోతుంది. కొత్త అంటే కొత్తవాల్లేమి కాదు, ఒకప్పుడు తమిల్ లో మంచి యాక్షన్ చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అప్పటి హీరో "రాంకీ".

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, నోరూరిస్తున్న బిరియానీ ఫోటోలు స్లైడ్ సోలో....

విడుదల ఎప్పుడంటే?

విడుదల ఎప్పుడంటే?


నిర్మాత మాట్లాడుతూ ''కార్తికి ఇది సరికొత్త పాత్ర. వినోదం, యాక్షన్‌ కలగలిపి ఉంటాయి. యువన్‌ మరోసారి చక్కటి బాణీలను అందించారు. ఆయన వందో సినిమా కచ్చితంగా గుర్తిండిపోతుంది. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

హన్సిక జర్నలిస్టుగా

హన్సిక జర్నలిస్టుగా


హన్సిక మాట్లాడుతూ.... ‘‘నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ ‘బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ‘ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది.

సంక్రాంతి కంటే ముందుగానే

సంక్రాంతి కంటే ముందుగానే


మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. సంక్రాంతి కి థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది.

భారీ అంచనాలు

భారీ అంచనాలు


ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు.

తెలుగు వారికి నచ్చేలా..

తెలుగు వారికి నచ్చేలా..


తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఛాయాగ్రహణం: శక్తిశరవణన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ఎన్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ప్రభు.

బిరియాని

బిరియాని


సినిమా పేరుకు తగిన విధంగానే ప్రేక్షకులకు పూర్తి తృప్తిని కలిగించేలా మంచి టేస్టీగా ఉంటుందట.

English summary
Karthi and Hansika in the lead upcoming film Biriyani ready to released. Hansika Motwani as its leading lady. Comedian Premgi Amaren will be seen in a full-length role alongside the protagonist in this comedy entertainer being directed by Venkat Prabhu of Gambler fame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu