For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి... సినీ ఛత్రపతి(పుట్టిన రోజు స్పెషల్)

  By Srikanya
  |

  హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో ఈ రోజు తిరుగులేని దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లో ఎనిమిది విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. 'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన సిని విజయ ప్రస్ధానం 'సై' మినహా 'ఈగ' (2012) దాకా ఎదురే లేకుండా కొనసాగుతూ వచ్చింది. రేపో, మాపో హిందీలో సైతం జెండా పాతటానకి రెడీ అవుతున్న రాజమౌళి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా తన పదో చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు.

  ఈగ

  ఈగ

  ఇప్పటివరకూ చెప్పుకున్న చిత్రాలన్నీ ఒకెత్తయితే 'ఈగ' ఒక్కటీ ఒకెత్తు. ఎందుకంటే 'ఈగ' వంటి కీటకాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించి, దాన్ని హీరోని చేసి భారీ విజయాన్ని సాధించడం తెలుగు సినిమా ప్రమాణాల రీత్యా ఏ రకంగా చూసినా గొప్ప విషయం. ఈ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా హాట్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఏ సినిమా తలపెట్టినా దానిపై అంచనాలు ఊహకందని రీతిలో ఉంటున్నాయి. రాజమౌళి సినిమా తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని ప్రభాస్ చెప్పడాన్ని బట్టి త్వరలో ఆయనతో చేయబోతున్న సినిమాని రాజమౌళి ఏ స్థాయిలో తీయబోతున్నారో అర్థమవుతుంది.

  మర్యాద రామన్న

  మర్యాద రామన్న

  వరసగా యాక్షన్ చిత్రాలు చేస్తూ వస్తున్న రాజమౌళి ఒక్కసారిగా ట్రెండ్ మార్చి సునీల్ తో 'మర్యాదరామన్న' తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే చిత్రం కాన్సెప్టుని ముందే రివిల్ చేసి ఓ కొత్త సంప్రదాయానికి తెరతీసారు. అయితే అమెరికన్ సైలెంట్ కామెడీ Our Hospitality(1923) ఎడాప్షన్ అని ఈ చిత్రం విమర్శలు పాలైంది. ఎన్ని విమర్శలు వచ్చినా చిత్రం మాత్రం కలెక్షన్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడంలోకి,బెంగాళ్ లోకి ఈ చిత్రం రీమేక్ అయ్యింది. త్వరలో హిందీలోకి సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ అవుతోంది.

  మగధీర

  మగధీర

  రామ్ చరణ్ ని ఒక్కసారిగా స్టార్ ని చేసిన చిత్రం మగధీర. హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రామ్ చరణ్ అభిమానులనే కాక అన్ని వర్గాల ప్రేక్షకులను విసేషంగా ఆకర్షించింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ప్లాష్ బ్యాక్ కు జనం ముగ్దులైపోయారు. తెలుగు సినిమా కలెక్షన్ రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. కాజల్ ని స్టార్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం త్వరలో హిందీలోకి రీమేక్ అవుతోంది.

  యమదొంగ

  యమదొంగ

  'సింహాద్రి'తో ఎన్టీఆర్ ని టాప్ స్టార్‌ని చేసిన రాజమౌళి మరోసారి 'యమదొంగ'తో ఎన్టీఆర్‌కి విజయానందాన్ని చేకూర్చారు రాజమౌళి. అలా రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్‌కు తిరుగనేదే లేకుండా పోయింది. 'యమదొంగ' ఓ సోషియో ఫాంటసీ చిత్రం. ఇంటర్వెల్ లో వచ్చే పెద్ద ఎన్టీఆర్ ని కలిసి జూ.ఎన్టీఆర్ ని కలుసుకునే సీన్స్ సినిమాను ఎక్కడికో తీసుకుపోయాయి. అలాగే మోహన్ బాబు..యముడుగా అదరకొట్టాడు. హిందీలోకి ఈ చిత్రం లోక్ పాలక్ గా, తమిళంలోకి యమరాజ గా డబ్బింగ్ అయ్యింది.

  విక్రమార్కుడు

  విక్రమార్కుడు

  వరస హిట్స్ తో దూసుకుపోతున్న రాజమౌళి కన్ను ఈ సారి రవితేజ పై పడింది. అతని కామెడీకు, తనదైన యాక్షన్ ని కలిపి అత్తిలి సత్తిబాబు పాత్రను, విక్రమ్ రాధోడ్ పాత్రను తయారు చేసి 'విక్రమార్కుడు' చిత్రం రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం తమిళంలోకి కార్తి తో సిరుతై గా రీమీకై హిట్టైంది. అలాగే కన్నడంలోకి వీర మదకరి గానూ, హిందీలోకి రౌడీ రాధోర్ గానూ రీమేక్ అయ్యింది. అలాగే బిక్రమ్ సింగ గా రీమేక్ అయ్యింది. ఈ చిత్రంతో రాజమౌళికి హిందీకి మంచి క్రేజ్ వచ్చింది.

  ఛత్రపతి

  ఛత్రపతి

  ప్రభాస్‌ తన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఏమిటంటే... వెంటనే చెప్పే చిత్రం 'ఛత్రపతి'. రీసెంట్ గా వచ్చిన రెబెల్ ప్రమోషన్ లో సైతం లారెన్స్... తన చిత్రం ఛత్రపతిలా ఉంటుందని ప్రమోట్ చేసుకున్నారు. తల్లి సెంటిమెంట్ కి యాక్షన్ కలిపి అల్లిన ఈ చిత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రం మళయాళంలోకి ఇదే టైటిల్ తో డబ్బింగ్ అయ్యింది. తమిళంలోకి ఈ మధ్యనే రాజమౌళి పేరుని ఇమిటేట్ చేస్తూ ఛంద్రమౌళి టైటిల్ తో డబ్బింగ్ అయ్యింది. కన్నడంలోకి త్వరలో ఛత్రపతిగా రీమేక్ అవుతోంది.

  సై

  సై

  రగ్బీ గేమ్ నేఫధ్యంలో రాజమౌళి డైరక్ట్ చేసిన సినిమా 'సై'. నితిన్, జెనీలియా కాంబినేషన్ లో కాలేజి బ్యాక్ డ్రాప్ లో లగాన్ తరహా కధాంశంతో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించకపోయినా విలన్ ని ఈ చిత్రంలో చూపినట్లు మరొకరు చూపలేదు అనే పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం మళయాళంలోకి ఛాలెంజ్ టైటిల్ తో డబ్బింగ్ అయ్యింది.

  సింహాద్రి

  సింహాద్రి

  ఎన్టీఆర్‌ని 'స్టూడెంట్ నెం.1'తో మాస్‌కి చేరువ చేసిన రాజమౌళి 'సింహాద్రి'తో టాప్ స్టార్‌ని చేశారు. ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా పడిందంటే, తర్వాత వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్ని వారు 'సింహాద్రి'తో పోల్చుకుంటూ అసంతృప్తి చెందుతూ వచ్చారు. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టైంది. మొదట వేరే డైరక్టర్ తో సినిమా ప్రారంభించి... అది సాగక రాజమౌళికి అవకాసం ఇచ్చిన నిర్మాత దొరస్వామిరాజుకు ఈ చిత్రం కనకవర్షం కురిపించింది. తమిళంలోకి ఈ చిత్రాన్ని గజేంద్ర టైటిల్ తోనూ, కన్నడంలోకి క్రాంతివీర గా రీమేక్ అయ్యి, రాజమౌళికి ఇండస్ట్రీలోకి సుస్ధిర స్దానం ఏర్పాటు చేసింది.

  స్టూడెంట్ నెం.1

  స్టూడెంట్ నెం.1

  తన గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి.. రాజాలాగ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్న చిత్రం 'స్టూడెంట్ నెం.1'. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ని మాస్ కి చేరువ చేసే ప్రయత్నం చేసారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాటలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. హిందిలోకి ఆజ్ కా ముజ్రామ్ గా డబ్బింగ్ అయ్యింది. తమిళంలోకి స్టూడెంట్ నెంబర్ 1 గా రీమేక్ అయ్యింది. అయితే రాఘవేంద్రుని పర్యవేక్షణ కావటంతో క్రెడిట్ ఆయనకే వెళ్లిపోయింది.

  ''రాజమౌళి సినీ ప్రయాణాన్ని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. 'స్డూడెంట్‌ నెం.1' నుంచి 'మగధీర' వరకూ ఒక దశ. 'మర్యాద రామన్న' నుంచి రెండో దశ. మొదటి దశలో దర్శకుడిగా స్థానం సంపాదించుకొని విజయాలు సాధించినా... రెండో దశ నుంచే సిసలైన రాజమౌళి బయటకి వచ్చాడు. 'ఈగ'లాంటి ప్రయోగాత్మక సినిమాలు రాజమౌళి నుంచి మరిన్ని చూడొచ్చు'' అని రాజమౌళి కెరీర్‌ని విశ్లేషిస్తున్నారు కీరవాణి. 'ఈగ' హిందీ సీమలోనూ వాలబోతోంది. ఈనెల 12న 'మఖ్ఖీ'గా విడుదలవుతోంది. ఆ చిత్రం కోసం బాలీవుడ్‌ జనాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ధట్స్ తెలుగు ఈ దర్శకుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  English summary
  SS Rajamouli is one of the most successful directors and screenwriters of Telugu film industry. Besides being commercially hit at the Box Office, some of his movies have also been critically acclaimed. The Eega helmet has given a big break to several young actors like Ram Charan Teja, Junior NTR, Prabhas, Nitin Reddy and Sunil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X