»   » నేడు నాగార్జున బర్త్ డే: చిరు, సచిన్, పవన్, మహేష్‌లతో... (రేర్ ఫోటోలు)

నేడు నాగార్జున బర్త్ డే: చిరు, సచిన్, పవన్, మహేష్‌లతో... (రేర్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ముందుగా అక్కినేని నాగార్జునకు వన్ ఇండియా ఫిల్మీబీట్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు. నేడు ఆయన 57వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. దాదాపు 60 ఏళ్లకు దగ్గరైనా మన్మధుడిలా నవనవలాడుతూ యువ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ బాక్సాఫీసు రేసులో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు నాగార్జున.

1959 ఆగష్టు 29న జన్మించిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు.

ఇండస్ట్రీలోని అందరి హీరోలతో నాగార్జున మంచి రిలేషన్ ఫిప్ మెయింటేన్ చేస్తుంటారు. వారితో కలిసి దిగిన నాగార్జున రేర్ ఫోటోలతో ఆయన ఫ్యామిలీ రేర్ పిక్చర్స్ స్లైడ్ షోలో....

టాలీవుడ్ టాప్ స్టార్స్

టాలీవుడ్ టాప్ స్టార్స్

టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లను ఇక్కడున్న దృశ్యంలో చూడొచ్చు.

హిట్ కాంబినేషన్

హిట్ కాంబినేషన్

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ హిట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘శివ' చిత్రం పెద్ద హిట్టయింది. చిరంజీవి-శ్రీదేవి కలిసి నటించిన ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి' చిత్రం కూడా భారీ హిట్టయింది. వర్మ-వెంకీ-శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘క్షణ క్షణం' కూడా హిట్టే.

నాగార్జున ఫ్యామిలీ

నాగార్జున ఫ్యామిలీ

అక్కినేని నాగార్జున తన భార్య అమల, పెద్ద కుమారుడైన అక్కినేని నాగ చైతన్య, రెండో కుమారుడైన అక్కినేని అఖిల్ లతో కలిసి దిగి ఫోటో.

మాస్టర్‌తో మన్మధుడు

మాస్టర్‌తో మన్మధుడు

ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూలర్క్‌తో కలిసి టాలీవుడ్ మన్మధుడు కలిసి దిగిన ఫోటో. సచిన్‌తో నాగార్జునకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ మధ్య ఐబీఎల్ టోర్నీలో ముంబై టీంను కొనుగోలు చేయడంతో నాగార్జున, సచిన్ మరింత క్లోజ్ అయ్యారు.

మెగాస్టార్, ప్రిన్స్‌తో కింగ్

మెగాస్టార్, ప్రిన్స్‌తో కింగ్

గతంలో ఓ అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ప్రిన్స్ మహేష్ బాబుకు అవార్డు అందిస్తున్న దృశ్యాన్ని ఈ ఫోటోల చూడొచ్చు.

అక్కినేని

అక్కినేని

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఫ్యామిలీతో పాటు, కూతుర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో. ఇందులో ఏఎన్ఆర్ వారసులుగా నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుశాంత్ తెరంగ్రేటం చేసారు.

ముచ్చటైన జంట

ముచ్చటైన జంట

భార్య అమలతో పాటు అక్కినేని నాగార్జున. సినిమాల్లో కలిసి నటించిన వీరు ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫోటోలో వారు ఎంతో రొమాంటిక్‌గా ఉన్నారు కదూ...!

టాలీవుడ్ అగ్రహీరోలు

టాలీవుడ్ అగ్రహీరోలు

మెగా స్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగార్జున. టాలీవుడ్‌ను పోటా పోటీగా ఏలిన నలుగురు అగ్ర హీరోలు.

నాగార్జున రేసింగ్ టీం

నాగార్జున రేసింగ్ టీం

అప్పట్లో మహేంద్ర సింగ్ ధోనికీ సంబంధించిన మహి బైక్ రేసింగ్ టీంలో కింగ్ నాగార్జునకు కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇపుడు దాని నుండి నాగార్జున వైదొలగారు.

సినీయర్ ఎన్టీఆర్‌తో

సినీయర్ ఎన్టీఆర్‌తో

సీనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ పార్వతిలతో కలిసి నాగార్జున. నాగార్జున తనయుడు సిసింద్రీ అఖిల్‌‌...ఎన్టీఆర్ దంపతులతో కలిసి ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఏఎన్ఆర్ ఫ్యామిలీ

ఏఎన్ఆర్ ఫ్యామిలీ

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఫ్యామిలీతో పాటు, కూతుర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో. ఇందులో ఏఎన్ఆర్ వారసులుగా నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుశాంత్ తెరంగ్రేటం చేసారు.

English summary
Nagarjuna Birthday today. Akkineni Nagarjuna is an Indian film actor, producer and television presenter who works primarily in the Telugu cinema, and television.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu