»   » సీఎం మీద కంప్లైంట్‌ ఇచ్చిన బిత్తిరి సత్తి, ఎందుకో తెలుసా..?

సీఎం మీద కంప్లైంట్‌ ఇచ్చిన బిత్తిరి సత్తి, ఎందుకో తెలుసా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తనదైన తెలంగాణా యాసతో, విభిన్నమైన మేనరింజంల తో.. టివీ ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన పర్సనాలిటీ బిత్తిరి సత్తి. తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైన బిత్తిరి సత్తి( రవి) ఇప్పుడు వెండితెర మీద కనిపించి నవ్వించబోతున్నాడు. 'ఇద్దరి మద్య 18' అనే సినిమాలో ఓ కామెడీ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.ముఖ్యంగా బిత్తిరిసత్తి చేసిన యాక్టింగ్, అతడి డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్వించేవిగా ఉన్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో బిత్తిరి సత్తి సీఎం మీద కంప్లైంట్‌ ఇస్తాడు. ఈ కంప్లైంట్‌ మీద చర్య తీసుకునేంత వరకు ఆహార దీక్ష చేస్తానని సత్తి చెప్పిన డైలాగులు అందరిని నవ్విస్తున్నాయి.

రామ్‌కార్తిక్, భాను త్రిపాఠి జంటగా ఎస్‌ఆర్‌పి విజువల్స్ పతాకంపై సాయి తేజా పాటిల్ సమర్పణలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ రూపొందిస్తున్న చిత్రం ఇద్దరిమధ్య 18. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా పోస్టర్‌ను ఆ మధ్యన తెలంగాణ మంత్రి హరీష్‌రావు విడుదల చేశారు.

నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ- అన్ని కమర్షియల్ హంగులతో యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో యువతకు సందేశం కూడా వుంటుందని, త్వరలో ఆడియోను విడుదల చేసి ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.

Bithiri Sathi New Movie Iddari Madhya 18 Official Trailer

బిత్తిరి సత్తి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రవిప్రకాష్, శివన్నారాయణ, బాబి లహరి, రాము, రఘు, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా:జి.ఎల్.బాబు, పాటలు:కందికొండ, వరికుప్పల యాదగిరి, రామ్ పైడిశెట్టి, చిలుకరెక్క గణేశ్, నిర్మాత:శివరాజ్‌పాటిల్, కథ, దర్శకత్వం:నాని ఆచార్య.

English summary
Bithiri sathi going to acting leading role in telugu comedy and love entertainer Iddari Madhya 18 Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu