»   » రజినీకాంత్ ఒక 420: బీజేపీ ఎంపీ మళ్ళీ కెలికాడు

రజినీకాంత్ ఒక 420: బీజేపీ ఎంపీ మళ్ళీ కెలికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు తమిళ రాజకీయ, సినీ ప్రముఖులకూ, తమిళ పత్రికలకూ ఇమ్మీడియట్ స్టఫ్ ఏదన్నా ఉందీ అంటే అది రజినీకాంత్ రాజకీయ ప్రవేశమే. స్వయంగా సినీ పరిశ్రమ నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో దాడి మొదలైపోయింది. భారతీ రాజా.. టి.రాజేందర్.. కస్తూరి లాంటి వాళ్లు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక రాజకీయ నాయకులు ప్రత్యేకంగా బీజేపీ నాయకులు మాత్రం కొంచం గట్టిగానే రజినీ వెంట పడుతున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసినప్పటి నుండి తీవ్ర విమర్శలు చేస్తున్నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.

పలుమార్లు రజనీపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తలైవా రాజకీయ అరంగేట్రాన్ని కూడా స్వామి వ్యతిరేకించాడు.. రజినీ నిజంగానే తమిళ వ్యక్తి అని నిరూపించుకోవాలని, రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ నాశనమవుతుందన్నారు. అంతేకాకుండా రజనీ రాజకీయాలకు పనికిరారంటూ వ్యాఖ్యానించాడు.

 BJP Subramanian Swamy calls Rajinikanth a 420

తాజాగా సుబ్రమణ్యస్వామి ఫోకస్ మరోసారి రజినీ మీదికి మళ్లింది. సూపర్ స్టార్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్త్ చెకప్ కోసమే అక్కడికి వెళ్లారని అందరూ భావిస్తున్నారు. ఐతే అక్కడెళ్లి రజినీ ఓ నైట్ క్లబ్బులో పోకర్ ఆడుతున్న ఫొటో ఒకటి సుబ్రమణ్యస్వామి చేతికి చిక్కింది. అంతే ఆయనిక రెచ్చిపోయారు. రజినీకాంత్ ఒక 420 అంటూ ట్వీట్ చేశాడు.

'ఆర్‌కే 420' అంటూ ఆయన పరుష పదజాలాన్ని పరోక్షంగా రజినీకాంత్‌ను ఉద్దేశించి ట్వీట్‌లో పేర్కొన్నారు. 'వావ్‌! ఆర్‌కే 420 తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అమెరికాలోని క్యాసినోలో గ్యాంబ్లింగ్‌ ఆడుతున్నారు. ఆయనకు అన్ని డాలర్లు ఎక్కడ నుంచి వచ్చాయో ఈడీ తప్పనిసరిగా కనుక్కోవాల్సిందే' అంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Rajinikanth's First Ever Selfie Video From USA Goes Viral
English summary
Swamy tweeted a photo of Rajinikanth allegedly gambling in a US Casino with a sarcastic comment ''Wow! RK 420 in a US Casino gambling to improve his health!! ED must find out from where his $ came from.''
Please Wait while comments are loading...