»   »  ముందస్తును ఎదుర్కుంటాం: వెంకయ్య

ముందస్తును ఎదుర్కుంటాం: వెంకయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkaiah Naidu
హైదరాబాద్: లోకసభకు ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. లోకసభకు ముందస్తు ఎన్నికలు రావడం తథ్యమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే సత్తా కాంగ్రెసు పార్టీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే చిత్తుశుద్ధి, నేర్పు, ఓర్పు కాంగ్రెసుకు లేవని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ అమెరికాతో అణు ఒప్పందంపై పరిపక్వతతో వ్యవహరించడం లేదని, మిత్రపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై తాము కాంగ్రెసును సమర్థించబోమని, అణు ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. అయితే అమెరికాను తాము వామపక్షాల మాదిరిగా గుడ్డిగా వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X