For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏది హిట్...ఏది ప్లాఫ్ తేలేది నేడే!

  By Staff
  |

  Hero
  నిన్న తేజ తన కేక సినిమాతో కేకలు పెట్టించాక ఈ రోజు మరో మూడు చిత్రాలు తమ సత్తా చూపుతామంటూ రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ...అల్లరి నరేష్,సయాలి భగత్ జంటగా ఆడుతూ పాడుతూ దర్శకుడు దేవి ప్రసాద్ రూపొందించిన బ్లేడు బాబ్జీ , ఫొటో ఫేం ఆనంద్ హీరోగా వంశి శిష్యుడు మద్దిరాల వెంకట్ రూపొందించింన కాశీపట్నం చూడర బాబు,నితిన్,భావన జంటగా ...జివి రూపొందించిన హీరో చిత్రం రిలీజు అయ్యాయి.


  ఇక 'బ్లేడు బాబ్జీ' చిత్రం

  హాలీవుడ్ బ్లూ స్ట్రెక్ అనే కామెడీ చిత్రానికి కాపీ అనే ప్రచారం జరుగుతోంది. అందులో హీరో ...తాను దొంగతనం చేసిన మొత్తాన్ని ఓ చోట పాతిపెడితే అక్కడో పోలీస్ స్టేషన్ వెలుస్తుంది. ఆ తర్వాత హీరో అక్కడికి పోలీసు వేషంలో ప్రవేశించి తను సంపాదించిన మొత్తాన్ని ఎలా తీసుకెళ్ళాడన్న పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఇదే కథ అయితే మంచి రిపోర్టే వచ్చే అవకాశం ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంలోని పాటను పేరడీ చేసారని కూడా తెలుస్తోంది. సత్యమూవీస్‌ బ్యానర్‌పై ముత్యాల సత్యకుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవీప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కోటి సంగీతం అందించిన పాటలు బాగానే ఉన్నాయన్న టాక్ వచ్చింది.కాబట్టి గెలిచే అవకాశం ఉంది.

  నితిన్ 'హీరో' సినిమా

  వరస పరాజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో నితిన్,భావన జంటగా రూపొందిన ఈ చిత్రంలో నితిన్ రాధాకృష్ణ గా కనిపిస్తాడు. అతని (నితిన్‌) తండ్రి పోలీస్‌ అధికారి. తన కొడుకు తనంతటి వాడు కావాలని కోరుకుంటాడు. తల్లికి మాత్రం కొడుకు సినిమా హీరో కావాలనుంటుంది. తల్లి చెప్పినట్లే రాధాకృష్ణ కూడా సినిమాల్లోకి వెళ్దామనుకొంటాడు. ఓ సందర్భంలో కృష్ణవేణి (భావన) పరిచయం అవుతుంది. అక్కడి నుంచి అతని జీవితంలో వచ్చిన మార్పులతో కధ ఉంటుందంటున్నారు. అలాగే ఈ చిత్రం దర్శకుడు సుధాకర నాయుడు (జీవీ)అధ్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేసాడని ఇప్పటికే టాక్ వచ్చింది. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రంలో నాగబాబు, రమ్యకృష్ణ, కోవై సరళ, బ్రహ్మానందం, రాజేష్‌, తిరుపతి ప్రకాష్‌, తనూరాయ్‌ తదితరులు మిగతా పాత్రల్లో కనిపిస్తారు. అనేక చిత్రాల్లో విలన్ గా చేసిన జీవీ ఈ సినిమాతో దర్శకుడయ్యారు. మణిశర్మ బాణీలు కూర్చారు.

  ఇక ఈ రోజు రిలీజవుతున్న మూడో సినిమా 'కాశీపట్నం చూడరబాబూ'.

  మల్టీ లెవిల్ మార్కెటింగ్ పై తీసిన తొలి తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రంలో హీరో ప్రేమించిన అమ్మాయిని చేసుకోబోతే అతని తండ్రి (తణికెళ్ళ) కట్నం పోతుందని ఒప్పుకోడు. అప్పుడు అతను కట్నం డబ్బు తానే సంపాదించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్రమంలో అతను ఓ మల్టి లెవిల్ మార్కెటింగ్ కి జనం చేత డబ్బు కట్టిస్తాడు. వాళ్ళు దుకాణం ఎత్తేస్తాడు. అప్పుడు హీరో ఆ సమస్యల నుండి బయిటపడి ఎలా ప్రేమని గెలిపించుకున్నాడనేదే మిగతా కథ.

  ఇక ఈ చిత్రంలో ఫొటో సినిమా ద్వారా పరిచయమైన విజయానంద్ హీరోగా కనిపిస్తాడు. సుప్రేన అనే ముంబయి అమ్మాయి హీరోయిన్ గా అందాలను ఒలకపోస్తోంది. ఎమ్‌.ఎస్‌.ఎమ్‌. వెంకటసాయి సినీ పార్క్‌ సంస్ధ నిర్మించిన ఈ చిత్రంపై దర్శక,నిర్మాతలకు చాలా ఆశలే ఉన్నాయి.ఇంకా ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌, కృష్ణభగవాన్‌, కొండవలస, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, జయలలిత, గీతాసింగ్‌, బెనర్జీ, గుండు సుదర్శన్‌, నామాల మూర్తి, సూర్య, రఘునాథరెడ్డి తదితరులు కనిపిస్తారు. ఇక ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కటి బాగున్నా మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వరస ఫ్లాపుల మధ్య ఒక్క యావరేజ్ చిత్రం వచ్చినా దాన్ని సూపర్ హిట్ చేయటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X