»   »  ఫ్యాషన్ షోలో నమ్రత, రాణా, మంచు లక్ష్మి...(ఫోటోలు)

ఫ్యాషన్ షోలో నమ్రత, రాణా, మంచు లక్ష్మి...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల మాదాపూర్లో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్‌ ఫ్యాషన్ షో మోడల్స్‌తో పాటు టాలీవుడ్ స్టార్స్ రాణా, నమ్రత, మంచు లక్ష్మి ప్రసన్న తదితరులు ర్యాంప్ వాక్ చేసి ఫ్యాషన్ షోకు మరింత ఆకర్షణ తెచ్చారు. బాలీవుడ్ తారలు మలైకా అరోరా ఖాన్, చిత్రంగద సింగ్ తదితరుల రాకతో షో మరింత ఆకర్షణీయంగా మారింది.

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ....మహేష్ బాబుతో కలిసి ర్యాంపు వాక్ చేయడం అంటే ఇష్టమని వెల్లడించారు. గతంలో మిస్ఇండియా టైటిల్ దక్కించుకున్న నమ్రతకు ర్యాంపు షోలు కొత్తేమీ కాదు. కానీ మహేష్ బాబు ఇప్పటి వరకు ఒకసారి కూడా ర్యాంపు షోలో పాల్గొనలేదు. మరి నమ్రత కోరిక తీరేదెప్పుడో చూడాలి.

బ్లెండర్స్ ప్రైడ్‌ ఫ్యాషన్ షోకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటోలు....స్లైడ్ షోలో చూద్దాం

మోడ్రన్ టచ్, భారతీయ సంప్రదాయం

మోడ్రన్ టచ్, భారతీయ సంప్రదాయం


భారతీయ సంప్రదాయం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా, అలా అని మోడ్రన్‌ టచ్‌ను ఏమాత్రం మిస్‌ కాకుండా జరిగిన ఈ ఫ్యాషన్‌ షో అన్ని వర్గాల వారిని అలరించింది.

పాలరాతి శిల్పాల్లాంటి మోడల్స్

పాలరాతి శిల్పాల్లాంటి మోడల్స్


భారీ వర్కులతో భారంగా లేకుండా లైట్‌ వర్క్ డిజైన్లతో మనసును హత్తుకుంది. పాలరాతి శిల్పాల్లాంటి మోడళ్లు ఈ ప్లెజెంట్‌ కలర్స్ దుస్తుల్లో మరింత ముగ్ధమనోహరంగా కనిపించారు. రెడ్‌, బ్లాక్‌, సిల్వర్‌, యాష్‌, పింక్‌ కలర్స్ ను హైలెట్‌ చేస్తూ డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్‌ అయింది. ఫ్యాషన్‌ షోకు రాయల్‌ లుక్‌ను తెచ్చింది.

అప్సరసలు

అప్సరసలు


ఓ వైపు క్లాసికల్‌ టచ్ ఉన్న మ్యూజిక్‌, మరో వైపు గుడిగంటల బ్యాక్‌ డ్రాప్‌ మధ్య మోడళ్లు రిథమిక్‌గా నడిచారు. బాలీవుడ్‌ తార మలైకఅరోరా ఖాన్‌ ఈ ఫ్యాషన్‌ షోలో అప్సరసలా దర్శనమిచ్చింది. సిల్వర్‌ కలర్‌ టాప్‌, మెరున్‌ కలర్‌ లెహంగాలో అదిరిపోయింది. కూసింత సిగ్గుపడుతూ కెమెరా ముందు మిణుక్కుమంది.

ఫుల్ గ్లామర్

ఫుల్ గ్లామర్


మరో బాలీవుడ్ అమ్మడు చిత్రాందసింగ్‌ ఈ షోలో మరింత గ్లామరస్‌గా కనిపించింది. లాంగ్‌ లైట్‌ కలర్‌ పింక్‌ ఫ్రాక్‌లో నెమలి నడకలు నడిచి షోకు మరింత అట్రాక్షన్‌గా నిలిచింది. ఒక్క లెహెంగా, శారీలే కాదు గాగ్రాలు, లాంగ్‌ ఫ్రాక్‌ డిజైన్లు ఈ షోలో క్లాసికల్‌ లుక్‌ను తెచ్చాయి.

రాణా

రాణా


మగువలకు ఏ మాత్రం తీసిపోమంటూ మేల్‌ మోడల్స్ గ్రాండ్‌ కుర్తా పైజామలు, డామినేట్‌ కలర్స్ లో స్కార్ఫ్ లు వేసుకొని మగధీరుల్లా నడిచారు. డిజైనరల్లు జేజే, విక్రమ్‌ల డిజైన్స్ అందరి మనసులను కొల్లగొట్టాయి. మొత్తానికి సంప్రదాయం, పాశ్చాత్యం మేళవింపుతో సాగిన బ్లెండర్స్ ప్రైడ్‌ ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.

English summary
The much-awaited fashion event of the year, Blenders Pride Fashion Tour 2013, that took place in the city on October 26 and 27, saw the city's who's who in full attendance. Tollywood heartthrob Rana Daggubati,made a grand entry as the showstopper, in a linen suit inspired from the 30s. As he entered, Rana threw his cap in the air that had ladies break into whistles and giggles. Lakshmi Manchu and Namrata Shirodkar were spotted in the front row.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu