»   » ఎన్టీఆర్, అక్కినేని తిరుగులేని విజయాలు..బొబ్బిలిపులి.. ప్రేమాభిషేకం మైలురాళ్లు..

ఎన్టీఆర్, అక్కినేని తిరుగులేని విజయాలు..బొబ్బిలిపులి.. ప్రేమాభిషేకం మైలురాళ్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోల ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో దర్శకులకు పెద్ద పీట వేసిన వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. తాను రూపొందించిన చిత్రాలతో దర్శకులకు గొప్ప కీర్తి తెచ్చారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు లాంటి నట దిగ్గజాలకు తిరుగులేని విజయాలను అందించారు. టాలీవుడ్‌లో మరువలేనటు వంటి చిత్రాలను రూపొందించారు.

బొబ్బిలిపులిగా ఎన్టీఆర్ చరిత్ర..

బొబ్బిలిపులిగా ఎన్టీఆర్ చరిత్ర..

నందమూరి తారక రామారావుతో మనుషులంతా ఒక్కటే, సర్కాస్ రాముడు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు దాసరి నిర్మించిన చిత్రాలు నందమూరి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.

ఏఎన్నాఆర్‌తో ప్రేమాభిషేకం..

ఏఎన్నాఆర్‌తో ప్రేమాభిషేకం..

అక్కినేని నాగేశ్వరరావుకు దాసరి నారాయణరావుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బుచ్చిబాబు, ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, అద్దాల మేడ, ప్రేమాభిషేకం, ప్రేమ మందిరం, బహుదూరపు బాటసారి, మేఘ సందేశం చిత్రాలను అందించారు. ప్రేమాభిషేకం టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. మేఘ సందేశం జాతీయ అవార్డుకు ఎంపికైంది.

అందాల నటుడితో బలిపీఠం..

అందాల నటుడితో బలిపీఠం..

అందాల నటుడు శోభన్‌బాబు, దాసరి నారాయణ మధ్య ఉన్న అనుబంధాన్ని గొప్పగా చెప్పుకొంటారు. బలిపీఠం, దీపారాధన, ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రాలు మంచి విజయాలను సాధించాయి.

కృష్ణంరాజుతో..

కృష్ణంరాజుతో..

రెబల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్‌లో మరిచిపోలేనటువంటి చిత్రాలను దాసరి అందించారు. కటకటాల రుద్రయ్య, గోరింటాకు, రంగూన్ రౌడీ, తాండ్రపాపారాయడు చిత్రాలను తీశారు.

చిరంజీవితో..

చిరంజీవితో..

చిరంజీవి కెరీర్‌లో వందో చిత్రం లంకేశ్వరుడు సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. హిట్లర్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించి .. అందులో ఓ పాత్రను పోషించారు.

English summary
Dasari narayana Rao movies become milestones in tollywood. He made with Bobbilipuli with NTR, Premabhishekam with ANR. As director he made Lankeshwarudu with chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu