»   » 'బాడీ గార్డ్' చిత్రం శాటిలైట్ రైట్స్ ముఫ్పై కోట్లు..అంతా షాక్

'బాడీ గార్డ్' చిత్రం శాటిలైట్ రైట్స్ ముఫ్పై కోట్లు..అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బాడీ గార్డ్. మళయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం హిందీలోనూ మంచి మార్కెట్ నే సంపాదించుకుంటోంది. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ముప్ఫై కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారు. అదీ కూడా మిగతా ఛానెల్స్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని.ఈ సంఘటనతో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. దబాంగ్ సూపర్ హిట్ కావటంతో సల్మాన్ ఖాన్ కి ఇంత అద్భుతమైన మార్కెట్ వచ్చింది. ఇక స్టార్ నెట్ వర్క్ వారు రీసెంట్ గా హౌస్ ఫుల్ -2 చిత్రాన్ని ఇరవై ఆరు కోట్లకు, సింగం చిత్రాన్ని 19 కోట్లకు శాటిలైట్ రైట్స్ చెల్లించి సొంతం చేసుకున్నారు. వీటిన్నటికన్నా రికార్డు షారూఖ్ ఖాన్ తాజా చిత్రం రా వన్ కి దక్కింది. ఈ చిత్రాన్ని ముప్పై ఐదు కోట్లకు కొనుగోలు చేసారు. దాన్ని స్టార్ నెట్ వర్క్ వారే కొనుగోలు చేసారు. త్రి ఇడియట్స్ చిత్రం కూడా మంచి రేటే పలికింది. ఈ మూడు చిత్రాల్లో కరీనా కపూరే హీరోయిన్ కావటం విశేషం.

English summary
The much awaited Salman Khan and Kareena Kapoor starrer has fetched huge a price for satellite rights. The film has been taken by Star Network and the price is rumored to be around the 30 crore mark.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu