»   » పవన్ కళ్యాణ్ కొడుకు కోసం నలుగురు బాడీగార్డులు!

పవన్ కళ్యాణ్ కొడుకు కోసం నలుగురు బాడీగార్డులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా స్టార్లకు ఈ మధ్య కాలంలో బయట తిరగడం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికెళ్లినా అభిమానులు, మీడియా వారు చుట్టూ చేరి ఇబ్బంది పెడుతుంటారు. అందుకే వారు బయటకు రావడమే చాలా అరుదు. ఒక వేళ వచ్చినా చుట్టూ బౌన్సర్లు(బాడీగార్డ్స్) తప్పనిసరి.

సినిమా స్టార్లకే కాదు....వారి పిల్లలది కూడా ఇలాంటి పరిస్థితే. ఇటీవలే ఇష్క్ వాలా లవ్ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయం అయిన పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కు కూడా ఇలాంటి పరిస్థితే. అందుకే అకీరా ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా నలుగురు బౌన్సర్లను నియమించారట. అతను స్కూలుకు వెళ్లినా, ఆడుకోవడానికి ఇతర ఏదైనా ప్రదేశాలకు వెళ్లినా చుట్టూ నలుగురు బాడీగార్డులు ఉంటారట.

Bodyguards accompany Akira Nandan

పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో బాగా పాపులర్ పర్సన్. పవన్ తనయుడిగా అకీరాకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే బౌన్సర్లను ఏర్పాటు చేసారట. మరో విషయం ఏమిటంటే పవన్-త్రివిక్రమ్ ఎలా క్లోజ్ ఫ్రెండ్సో..... పవన్ తనయుడు అకీరా, త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్ మంచి స్నేహితులట. ఇద్దరూ కలిసి ఆడుకోవడం, ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్లడం లాంటివి చేస్తుంటారట.

అకీరా నందన్ ప్రస్తుతం తల్లి రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నాడు. భవిష్యత్తులో అకీరాను పెద్ద స్టార్ హీరోగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో రేణు దేశాయ్ ముందుకు సాగుతున్నారు.

English summary
Personal bodyguards accompany Akira Nandan, son of Pawan Kalyan where ever he go including school. There are about four guards who always surround him.
Please Wait while comments are loading...