»   » తమిళ రీమేక్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్.. అరవింద్‌స్వామి మరోసారి

తమిళ రీమేక్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్.. అరవింద్‌స్వామి మరోసారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

టచ్ చేసి చూడు షూటింగ్‌లో బిజీగా ఉన్న మాస్ మహారాజ రవితేజ ఓ తమిళ చిత్రం రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ చిత్రమేమిటంటే తమిళ దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందిన బోగన్. ఈ చిత్రంలో జయం రవి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది.

బోగన్ రీమేక్ వాస్తవమే..

బోగన్ రీమేక్ వాస్తవమే..

బోగన్ రీమేక్ విషయాన్ని దర్శకుడు లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. బోగన్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం వాస్తవం. రవితేజ సారు ఈ చిత్రంలో నటిస్తున్నారు అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

జయం రవి పాత్రలో రవితేజ

జయం రవి పాత్రలో రవితేజ

ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదని తెలిసింది. తమిళంలో జయం రవి పోషించిన పాత్రలో రవితేజ నటించనున్నారు. తెలుగు రీమేక్ కూడా లక్ష్మణ్ దర్శకత్వం వహించనున్నారు.

క్లైమాక్స్ మార్చేస్తున్నాం..

క్లైమాక్స్ మార్చేస్తున్నాం..

స్క్రిప్టు లాక్ చేశాం. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. తెలుగు వెర్షన్ కోసం క్లైమాక్స్ మార్పు చేస్తున్నాం. అరవింద్ స్వామి ఈ చిత్రంలో నటించే అవకాశం ఉంది అని లక్ష్మణ్ సన్నిహితులు వెల్లడించారు.

తెలుగులో కూడా అరవింద్ స్వామి

తెలుగులో కూడా అరవింద్ స్వామి

ధ్రువ చిత్రంలో అరవింద్ స్వామి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అరవింద్ స్వామికి క్రేజ్ ఉన్నందు వలన ఆయనను ఈ చిత్రంలో నటింపజేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిసింది.

English summary
Ravi Teja, who is currently busy with Telugu film Touch Chesi Chudu, will work with director Lakshman on the Telugu remake of Tamil hit, Bogan, starring Jayam Ravi and Arvind Swami. Lakshman will direct the Telugu version as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu