డ్రగ్స్ ఇచ్చి, కార్లో రేప్ చేశాడు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు: స్టార్ హీరోయిన్ ఫిర్యాదు

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి తనను రేప్ చేశాడని ఓస్టార్ హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్ర సీమలో 'క్వీన్'గా పాపులర్ అయిన ఆ నటి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ సంఘటన గురించి తాను 2004-2006 మధ్యలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి వెల్లడించానని, అయితే అతడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అందులో ఆమె పేర్కొన్నారు. బైలోని వెర్సోవా పోలీసులకు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన రెండున్నర పేజీల లేఖను ఓ ఆంగ్లపత్రిక బయట పెట్టింది. ఇందులో సదరు నటి చాలా విషయాలు ప్రస్తావించారు.

ఎన్నో కలలో ముంబై వచ్చాను

ఎన్నో కలలో ముంబై వచ్చాను

‘ఎన్నో కలలో ఏదో ఒకరోజు ఉన్నతస్థాయికి చేరుకోవాలనే ఆశతో ముంబై వచ్చాను. ఆ సంవత్సరం... నేను ఆదిత్య పంచోళిని కలిశాను. ఆయన వయసు అపుడు 38 సంవత్సరాలు. నాకంటే 22 సంవత్సరాలు పెద్దవారు. నేను కొంత మంది అమ్మాయిలతో కలిసి హాస్టల్‌లో ఉండేదాన్ని. ఆయనకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడి కూతురు కూడా నా వయసు ఉంటుంది' అని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు.

డ్రగ్స్ ఇచ్చి కార్లో రేప్ చేశాడు

డ్రగ్స్ ఇచ్చి కార్లో రేప్ చేశాడు

‘‘2004లో నేను పంచోళితో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ డ్రింక్ తీసుకున్న తర్వాత మైకం కమ్మింది. నేను తాగిన పానీయంలో ఏదో కలిపాడనే అనుమానం వచ్చింది. పార్టీ అయిపోయిన తర్వాత పంచోళి తనను ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అన్నాడు. నేను అతడి రేంజ్ రోవర్ కార్లో వెళ్లాను. యారి రోడ్ మధ్యలో కారు ఆపి నన్ను రేప్ చేశాడు. నా ఫోటోలు కూడా తీశాడు. ఆ విషయం నేను గమనించలేక పోయాను.

ఆ ఫోటోలు తీసి బెదిరించాడు

ఆ ఫోటోలు తీసి బెదిరించాడు

‘తర్వాత మేము కలిసినపుడు... భార్య భర్తల్లా కలిసి ఉందాము అన్నాడు. మీరు నా తండ్రి వయస్కులు. నేను నా వయసు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. దీంతో వెంటనే అతడు ఆ రోజు కార్లో తీసిన ఫోటోలు నాకు చూపి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ ఫోటోలు ఇతరులకు చూపిస్తానని బెదిరించాడు. నేను చిన్నదాన్ని కావడం, నాకు ముంబైలో అండగా ఎవరూ లేక పోవడంతో దాన్ని అడ్వాంటేజీగా తీసుకున్నాడు'

నన్ను హింసించాడు, ఆ అధికారికి చెప్పినా చర్య తీసుకోలేదు

నన్ను హింసించాడు, ఆ అధికారికి చెప్పినా చర్య తీసుకోలేదు

2004-2006 సంవత్సరం మధ్య కాలంలో పంచోలి తనను వివిధ ప్రదేశాల్లో ఉంచాడు. మత్తు మందు కలిపి నాతో బలవంతంగా రిలేషన్‌షిప్ కొనసాగించాడు. నా ఫోటోలు చూపి బ్లాక్ మెయిల్ చేస్తుంటే కొన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాను. అతడు నేను వెళుతున్న ఆటో రిక్షాను ఆపి నన్ను కొట్టేవాడు. ఓసారి ఇలా కొడుతుంటే పాదచారి ఒకరు వచ్చి కాపాడారు. ఆ సమయంలో నేను సీనియర్ పోలీస్ ఆఫీసర్ బిపిన్ బిహానికి కలిసి విషయం చెప్పాను. కానీ అతడు ఎలాంటి చర్య తీసుకోలేదు

రూ. 50 లక్షలు ఇచ్చాను

రూ. 50 లక్షలు ఇచ్చాను

‘2008, 2009లో నేను బాంద్రా షిప్ట్ అయ్యాను. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న నా సోదరి నా వద్దే ఉండేది. నేను షూటింగులకు వెళ్లినపుడు అతడు మా ఇంటికి వచ్చి నా సిస్టర్‌ను కొట్టాడు. ఇంటికి వచ్చే సరికి నా సోదరి భయపడుతూ వణుకుతూ కనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నావని అతడికి ఫోన్ చేసి అడిగితే... నీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాను, నా డబ్బు నాకు ఇవ్వు అని అడిగాడు. ఎంత కావాలి అంటే రూ. 1 కోటి కావాలన్నాడు. నేను రూ. 50 లక్షలు ఇవ్వడంతో అతడితో ఇబ్బంది కొంతమేర తగ్గింది.'

నా కెరీర్ నాశనం చేస్తా అన్నాడు

నా కెరీర్ నాశనం చేస్తా అన్నాడు

‘నేను బాగా ఫేమస్ అవ్వడంతో పంచోళి మళ్లీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు కోసం బెదిరించడం మొదలు పెట్టాడు. నా సోదరి, సోదరుడికి కూడా బెదిరిస్తూ సందేశాలు పంపాడు. నీ స్నేహితులకు, ఫ్యామిలీకి ఆ ఫోటోలు పంపి నీ కెరీర్ నాశనం చేస్తాను అని బెదిరించేవాడు' అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X