»   »  ఆయన దర్శనం కోసం సినీ తారల క్యూ...!

ఆయన దర్శనం కోసం సినీ తారల క్యూ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పలువురు సినీ తారలు దర్శించుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్, జూహీచావ్లా, టాలీవుడ్ నటి స్నేహ మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని సేవించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందచేశారు.

దీపిక పదుకోన్ సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. ఆమె రజనీకాంత్‌కు జోడీగా నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వంలో 3డిలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో పాటు 'ఫైడింగ్ ఫర్నీ ఫెర్నాండెజ్', 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రాల్లో నటిస్తోంది.

Bollywood Actress Deepika Padukone Visits Tirumala

హీరోయిన్ స్నేహ విషయానికొస్తే...ఆమె తెలుగులో ఉలవచారు బిర్యానీ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Bollywood Actress Deepika Padukone, Juhi Chawla and South Actress Sneha Visits Tirumala today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu