»   » లవ్ ఎఫైర్స్: హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య..(ఫోటో ఫీచర్)

లవ్ ఎఫైర్స్: హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య..(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగం అంటేనే నటన. సినిమాల్లో కనిపించే రొమాన్స్, సెంటిమెంట్, లవ్ ఇదంతా కేవలం కల్పితం. నటీ నటులతో ఇవన్నీ చేయించేది దర్శకుడు. ఇలాంటివి చేయించే క్రమంలో ఒక్కోసారి దర్శకులు నిజంగానే హీరోయిన్లతో ప్రేమలో పడుతున్నారు. రియల్ లైఫ్‌లో వారికి దగ్గరవుతున్నారు. రొమాన్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు, దర్శకుల సంబంధాలు పెళ్లి వరకు వెలుతున్నాయి. ఇటీవల జరిగిన హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు ఎఎల్ విజయ్ పెళ్లి ఉదంతమే ఇందుకు నిదర్శనం.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనతో పని చేసిన చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేసారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఊర్మిలా మండోద్కర్, మధు శాలిని లాంటి వారితో ఆయనకు లవ్ రిలేషన్‌షిప్ ఉందనే పుకార్లు సైతం వినిపించాయి. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన విక్రమ్ భట్ అమీషా పటేల్, సుస్మితా సేన్‌లతో ఎఫైర్లు నడిపినట్లు వచ్చిన వార్తలు అప్పట్లో సంచలనం. ఇందుకు పలు ఆధారాలు కూడా లభించడం గమనార్హం.

ఇలాంటి దర్శకులు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. నటి కల్కి కోచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దేవ్ డి సినిమా సమయంలో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. ఇలాంటి దర్శకులు, హీరోయిన్లకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

గురుదత్, వహీదా రహమాన్

గురుదత్, వహీదా రహమాన్

బాలీవుడ్ దర్శకుడు, నటి వహీదా రహమాన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పట్లో అదో సంచలనం. అప్పటికే గురుదత్‌కు గీతా రాయ్ తో వివాహం జరిగింది. వహీదాతో రిలేషన్ షిప్ ఫెయిల్ కావడంతో తాగుడుకు అలవాటైన గురుదత్ 1964లో మరణించారు.

మహి గిల్, తిగ్మాన్షు ధూలియా

మహి గిల్, తిగ్మాన్షు ధూలియా

బాలీవుడ్ హాట్ బ్యూటీ మహి గిల్...దర్శకడు తిగ్మాన్షు ధూలియాతో ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో రూమర్లు వినిపించాయి.

సాజిద్ ఖాన్, జాక్వెలిన్

సాజిద్ ఖాన్, జాక్వెలిన్


దర్శకుడు సాజిద్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ఎఫైర్ నడిపినట్లు, 2013లో వీరు విడిపోయినట్లు వార్తలు వినిపించాయి.

పరిణితి చోప్రా, మనీష్ శర్మ

పరిణితి చోప్రా, మనీష్ శర్మ


పరిణితి చోప్రా, మనీష్ శర్మ మధ్య ప్రేమాయణం సాగినట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇద్దరూ కలిసి చాలా సార్లు రెస్టారెంట్లలో కనిపించడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అనురాగ్ కశ్యప్, కల్కి కోచ్లిన్

అనురాగ్ కశ్యప్, కల్కి కోచ్లిన్


బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి కల్కి కోచ్లిన్ మధ్య ‘దేవ్ డి' సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు.

రాణి ముఖర్జీ-ఆదిత్య చోప్రా

రాణి ముఖర్జీ-ఆదిత్య చోప్రా


నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్, నిర్మాత అయిన ఆదిత్య చోప్రా హీరోయిన్ రాణి ముఖర్జీతో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు వీరి ఎఫైర్ కొనసాగింది. ఇటీవలే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

ఇమాన్ అలి-ఇంతియాజ్ అలి

ఇమాన్ అలి-ఇంతియాజ్ అలి


బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలి, పాకిస్తాన్ మోడల్ ఇమాన్ అలి మధ్య ఎపైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇంతియాజ్ అలీ మ్యారేజ్ లైఫ్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ


రామ్ గోపాల్ వర్మ తనతో కలిసి పలు చిత్రాల్లో పని చేసిన ఉర్మిలా, నిషా కొటారి, ఆంత్రమాలిని, మధుశాలిని లాంటి వారితో ప్రేమాయణం నడిపారనే పుకార్లు ఆ మధ్య వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో ఇప్పటికీ తేలలేదు.

విక్రమ్ భట్

విక్రమ్ భట్


బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ హీరోయిన్ల అమీషా పటేల్, సుస్మితా సేన్‌లతో డేటింగ్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.

English summary

 The movie sometimes doesn't get over after cut or pack up. While shooting, some talented directors have fallen for gorgeous Bollywood actresses on the sets. There are many Bollywood actresses who made news for dating directors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu