»   » జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్, సినీ స్టార్స్ ఆగ్రహం

జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్, సినీ స్టార్స్ ఆగ్రహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఓ ప్రముఖ పత్రికకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటనపై బాలీవుడ్ స్టార్స్ ఫైర్ అయ్యారు. గురువారం సాయంత్రం నిర్మానుష్యంగా ఉన్న దక్షిణ ముంబైలోని శక్తి మిల్ కాంపౌండులో ఘటన జరిగింది. దీనిపై బాలీవుడ్ స్టార్స్ క్రింది విధంగా స్పందించారు.

కరణ్ జోహార్ : బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన కరణ్ జోహార్ స్పందిస్తూ....'ముంబై నగరంలో ఒక మహిళపై అత్యాచారం జరుగడం సిగ్గుగా ఫీలవుతున్నా' అని వ్యాఖ్యానించారు.

వరుణ్ ధావన్ : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ స్పందిస్తూ...ఇలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరి తీయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.

సోనమ్ కపూర్ : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఘటన నన్ను ఆందోళనకు గురి చేసిందని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వ్యాఖ్యానించారు.

Bollywood

ఫర్హాన్ అక్తర్ : బాలీవుడ్ దర్శకుడు, నటుడు పర్హాన్ అక్తర్ మహిళా జర్నలిస్టు గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీస్ కమీషనర్ ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రేప్ ఘటనల్లో వెంటనే కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు. రేప్ జరిగిన ప్రాంతం మాదక ద్రవ్యాలు విక్రయించే వారు, వాటిని సేవించే వారు సంచరించే ప్రదేశమని అంతా అంటున్నారు. అలాంటి వాటిపై పోలీసులు ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు.

నర్గీస్ ఫ్రక్రి : మహిళా జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎంతో ఆందోళన చెందుతున్నాను అని నటి నర్గీస్ ఫ్రక్రి వ్యాఖ్యానించారు.

అమృతరావు : అత్యాచార ఘటనల్లో కఠిన శిక్షలు అమలు కావడం లేదు. బాధితులకు న్యాయం జరుగడంలో జాప్యం జరుగుతోంది. అందుకే ఎలాంటి భయం లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు అని నటి అమృతరావు వ్యాఖ్యానించారు.

అదిథి రావు హైదరి : దేశంలో ప్రతి సెకనుకు అత్యాచారం, హత్య లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొంత కాలం భయపడి, కోపగించుకుని, చిరాకుపడి....అన్నీ మరిచిపోతున్నాం. ఈ వ్యవస్థ మారేదెప్పుడో? అని అదిథి రావు వ్యాఖ్యానించారు.

బోమన్ ఇరానీ : ఎవరూ బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గు చేటు అని నటుడు బోమన్ ఇరానీ వ్యాఖ్యానించారు.

ఎంఎం జోషీ మార్గ్ పోలీసుల కథనం ప్రకారం - ఓ అసైన్‌మెంట్‌పై ఆమె మిల్ కాంపౌండుకు వెళ్లింది. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. జస్లోక్ అస్పత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలుస్తోంది. మిల్ కాంపౌండు ప్రాంతం అత్యంత ప్రమాదకరమైందని, అసాంఘిక శక్తులు అక్కడ స్వైర విహారం చేస్తాయని అంటారు. ఆమెతో పాటు వచ్చిన మగ సహోద్యోగిని దుండగులు కొట్టి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయికి గాయాలయ్యాయని, రక్తం కూడా కారుతోందని, అయితే చికిత్సకు ప్రతిస్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

English summary
Bollywood is ashamed and angry over the recent gang rape that happened in Mumbai with a photo journalist. Celebrities took to twitter to express the disgust.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu