»   » గ్లామర్ గదిలో గడపటానికి గంటకి ఇరవై వేలు: బాలివుడ్ తారలంతా క్యూ కడుతున్నారు

గ్లామర్ గదిలో గడపటానికి గంటకి ఇరవై వేలు: బాలివుడ్ తారలంతా క్యూ కడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిల్వర్ స్క్రీన్‌పై గోల్డ్ లా మెరిసిపోవాలంటే ఆ గదిలోకెళ్లాల్సిందే. ఆ గది లో గంతసేపు ఉంటే చాలు చర్మం అందంగా మెరిసిపోతుందట. అద్బుతమైన అందం మీ సొంతమౌత్యుందట. ఖర్చు కేవలం (కేవలం అంటే మనక్కాదు డబ్బులున్నొళ్ళకే) జస్ట్ గంటకి ఇరవై వేలు. ఇక నేం బాలీవుడ్ తారలంతా ఆ గది ముందు క్యూ కడుతున్నారు. రకరకాల వాతవరణాల ప్రభావం వల్ల మెరుపు తగ్గిన చర్మాన్ని మళ్ళీ మిస మిసలాడేలా తీర్చి దిద్దుకుంతున్నారు ఇంతకీ ఏమిటా గది? ఆ గదిలో గ్లామర్ రహస్యం ఏమిటీ అంటే.....

షూటింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. కానీ, కెమెరా ముందు నటించడానికి చాలా కష్టపడాలి. ఫ్లడ్ లైట్స్ వేడి తట్టుకోవాలి. వెదేశాల్లో షూటింగ్ లో మంచుకురుస్తున్నా, ఎంద మండించేస్తున్నా నటించాలి అందరిలా ఒకే వాతావరణానికి అలవాటుపడే వీలుండదు. కొన్నాళ్లు ఇక్కడ... కొన్నాళ్లు విదేశాల్లో..! ఫలితంగా స్కిన్, హెయిర్‌కి సంబంధించి ఇబ్బందులు నటులకి సర్వసాధారణం. మరి గ్లామర్ ఫీల్ద్ లో ముఖ్యమైన పెట్టుబడి అందమే కదా అదే తగ్గిపోతే ఎలా..?

Bollywood celebrities spending money for Oxygen Therapy

ముఖ్యంగా స్కిన్ కోసమైతే స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎలాగూ మార్కెట్లో బోల్డన్ని క్రీములు దొరుకుతాయి. బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. అక్కడికెళ్లిపోయి ఒంటిని వాళ్లకి అప్పగించేస్తే, ఏవేవో క్రీములు పూసేసి, మెరుపులు తెప్పిస్తారు. అయితే ఆ కెమికల్ ఫార్ములాలు అందరి వొంటికీ సరిపడవు దీర్ఘ కాలం లో మరిన్ని సమస్యలను తీసుకువస్తాయి.

అందుకే ప్రకృతి సిద్దంగా అందాన్ని కాపాడుకునే పద్దతినే ఫాలో ఔతున్నారు ఈ జాబితాలో కత్రినా కైఫ్ అందరికన్నా ముందే ఉంది. త్వరలో విడుదల కానున్న "హీరో" ద్వారా కథానాయికగా పరిచయం కానున్న నటుడు సునిల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కూడా కత్రినానే ఫాలో ఔతోందట. హీరోయిన్లే కాదు.. వరుణ్ ధావన్, అమిత్ సాద్ వంటి హీరోలది కూడా ఇదే బాట అట. తమ చర్మ సమస్యలకూ, అందానికీ ఆ గదులనే ఆశ్రయిస్తున్నారు.

ఇంతకీ వీళ్లు ఫాలో అవుతున్నది ఏంటి? ఇంతకీ ఆ గదిలో ఏం ఉందీ అనే విషయానికొస్తే.. వీరంతా అనుసరిస్తున్న చికిత్సా విధానం పేరు "హెచ్‌బిఒటి" అట(హైడ్రోబేరిక్ ఆక్సిజన్ థెరపీ). ఇదేలా ఉంటుందీ అంటే ఒక చిన్న అద్దాల గదిలో ఈ థెరపీ చేస్తారు. ఆ గది నిండా ఆక్సిజన్ నింపి ఉంచుతారు. ఎండకు కమిలిపోయిన చర్మం, చల్లదనానికి గరుకుగా తయారైన చర్మం... ఇలా ఏ చర్మానికైనా నూతనోత్తేజం తేవడానికి ఈ ఆక్సిజన్ చాంబర్ ఉపయోగిస్తారట.

బాలీవుడ్‌లో ఇప్పుడీ చాంబర్‌లోకి డబ్బులిచ్చి మరీ చొరబడుతున్న తారల జాబితా చాలానే ఉందని బోగట్టా. ముఖ్యంగా కత్రినా కైఫ్ అయితే వీలు కుదిరినప్పుడల్లా "హెచ్‌బిఒటి" చేయించుకుంటున్నారట. ఈ గదిలో కేవలం ఒక గంట మాత్రమే ఉండాలట. ఆ గంట ఖరీదు 20 వేల రూపాయలు. గంట తర్వాత బయటికొచ్చినవాళ్ల చర్మంలో ఓ కొత్త మెరుపు, తాజాదనం కనిపిస్తుందట.గ్లామర్ గా కనిపించినంత కాలమే ఇక్కద మార్కెట్ ఉంటుంది అందుకే ఆ అందన్ని కాపాదుకోవటానికి ఎన్ని తిప్పలైనా పడాల్సిందే ఎన్ని వేలైనా ఖర్చు పెట్టాల్సిందే..

English summary
Looks like Bollywood has unlocked the secret to stay beautiful despite their hectic schedule. And this big beauty secret is Oxygen Therapy .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu