For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెద్ద వయస్సు స్త్రీలతో సినిమావారి 'నిజ జీవిత రొమాన్స్' (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: సినిమాల్లో సాధారణంగా ఎక్కువ వయస్సున్న హీరోలు , తమకంటే చాలా చిన్న వయస్సులో ఉన్న హీరోయిన్స్ తో ఆడి, పాడుతూ ఉంటారు. అయితే నిజ జీవితంలో సీన్ రివర్స్ గా ఉంది. వాస్తవ జీవితాల్లోనూ ఎక్కువ మంది తమ కంటే చిన్నవారినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు.

  సాధారణంగా రొటీన్ కి భిన్నంగా వెళ్లటానికి చాలా మంది ఇష్టపడరు. భిన్నంగా చేస్తే జీవితంలో ఏదో జరిగిపోతుందనేది చాలా మంది నమ్మకం. కానీ ప్రేమకు అందచందాలు, వయస్సు, కుల, మత, ప్రాంత, భాష, వయోభేదాలుండవని నిరూపిస్తున్నారు కొంత మంది బాలీవుడ్‌ నటులు.

  తాజాగా ఒకప్పటి బాలీవుడ్‌ నటీమణి జీనత్‌ అమన్‌ (61) తనకంటే చాలా చిన్నవాడైన 36 ఏళ్ల వ్యక్తి ప్రేమలో పడ్డారనే వార్త చిత్రపరిశ్రమలో గుప్పుమంటోంది. కొన్ని బాలీవుడ్‌ జంటల ప్రేమ ముందు వయోభేదం అడ్డుగా నిలవలేకపోయింది. అటువంటి జంటల్లో కొన్నింటిని స్లైడ్ షో ద్వారా పరిశీలిద్దాం..

  ఫరాఖాన్‌- శిరీష్‌ కుందర్‌

  ఫరాఖాన్‌- శిరీష్‌ కుందర్‌

  బాలీవుడ్‌ దర్శకులు శిరీష్‌ కుందర్‌ తన భార్య, దర్శకురాలు ఫరా ఖాన్‌ కంటే 8 ఏళ్లు చిన్నవాడు. ఆమె దర్శకత్వం వహించిన తొలి సినిమా 'మై హూనా' సినిమా చిత్రీకరణలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వయస్సు.. వేర్వేరు మతాలు వీరికి ప్రేమ పెళ్లికి ఆటంకం కాలేదు. 2004లో వీరిద్దరు ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరికి ముగ్గురు పిల్లలు. 'రెండో జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ బహుశా ఉంటే నేను తిరిగి శిరీష్‌ భార్యగానే పుడతాను' అని ఇటీవల ఫరాఖాన్‌ పేర్కొనటం విశేషం.

  అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్వర్యా రాయ్‌

  అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్వర్యా రాయ్‌

  బాలీవుడ్‌లో ప్రముఖ జంటగా పేరొందిన అభిషేక్‌, ఐశ్వర్యల ప్రేమ కథలో కూడా వయస్సు అడ్డుగా నిలవలేదు. ఐశ్వర్యకంటే అభిషేక్‌ 2 ఏళ్లు చిన్నవాడు కావటం, ఆమె జాతకంలో దోషం ఉందనే వార్తలు ఏవీ కూడా వారి వివాహానికి అడ్డు కాలేదు. 2007లో వీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు. వారికి ఇప్పుడు ఒక కుమార్తె.

  ఆదిత్యా పంచోలి-జరీనా వహాబ్‌

  ఆదిత్యా పంచోలి-జరీనా వహాబ్‌

  26 ఏళ్లుగా వీరి కాపురం చల్లగా సాగుతోంది. జరీనాకంటే ఆదిత్యా పంచోలి 6 ఏళ్లు చిన్నవాడైనప్పటికీ వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పలేదు. తమకి ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ వల్ల తమ వివాహ బంధానికి వయస్సు ఆటంకంగా నిలవలేదని జరీనా వెల్లడించారు.

  సునీల్‌ దత్‌-నర్గీస్‌

  సునీల్‌ దత్‌-నర్గీస్‌

  తనకంటే ఏడాది పెద్దది, అప్పటికే ప్రముఖ నటీమణిగా పేరుపొందిన నర్గీస్‌ని సునీల్‌ దత్‌ వివాహమాడారు. 1957లో 'మదర్‌ ఇండియా' సినిమా షూటింగ్‌ సెట్లలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సునీల్‌ దత్‌.. నర్గీస్‌ని రక్షించారు. అలా వారి మధ్య ప్రేమ మొలకెత్తింది. 'నేను చనిపోయినా నా ఆత్మ నీతోనే ఉంటుంది. మరణం నన్ను నీ నుంచి వేరు చేయలేదు' అని నర్గీస్‌ ఒకసారి సునీల్‌ దత్‌కి లేఖ రాశారు. ఇలాంటి అమర ప్రేమ ఉన్నచోట వయస్సు తేడా కనిపించదు.

   అర్జున్‌ రాంపాల్‌-మెహర్‌ జెస్సికా

  అర్జున్‌ రాంపాల్‌-మెహర్‌ జెస్సికా

  వివాహమై పదేళ్లు దాటినప్పటికీ అర్జున్‌ రాంపాల్‌కి తన భార్య జెస్సికాపై ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు. తనకంటే రెండేళ్లు పెద్దదైన మెహర్‌ జెస్సికాని ఆయన 1998లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.

  రాజ్‌ కుంద్రా-శిల్పాషెట్టి

  రాజ్‌ కుంద్రా-శిల్పాషెట్టి

  తనకంటే మూడు నెలలు చిన్నవాడైన రాజ్‌కుంద్రాని శిల్పాశెట్టి వివాహమాడారు. ఆమె నటించిన 'ఎస్‌2 పెర్ఫ్యూమ్‌' చిత్రీకరణ సమయంలో వారిద్దరూ తరుచూ కలుసుకోవటం.. చివరికి అది 2009, నవంబరు 22న పెళ్లికి దారితీసింది.

  పర్మీత్‌-అర్చనా పురానా సింగ్‌

  పర్మీత్‌-అర్చనా పురానా సింగ్‌

  వైవాహిక జీవితంలో వైఫల్యాన్ని ఎదురుచూసిన పురానా సింగ్‌ అనుకోకుండా ఒకసారి పర్మీత్‌ని కలుసుకున్నారు. ఆమెకంటే అతడు ఏడేళ్లు చిన్నవాడైనా ఆమె అందానికి, ఠీవీకి అతడు దాసోహం అన్నాడు. 20 ఏళ్లుగా వారు ఆనందమయ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 'వివాహానికి వయస్సు ఒక ముఖ్యమైన అర్హత అయితే సరైన వయస్సు నిష్పత్తితో చేసుకున్న వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయని' అని పర్మీత్‌ ప్రశ్నించారు.

  English summary
  Age has never come in the way of romance of Bollywood couples. In fact it has been observed that couples with age differences live in better harmony than same aged couples. It could be the maturity of one of the partners that helps the couple tide over difficult times. Here’s a look at the most successful couples in Bollywood who are madly in love despite their age difference.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X