»   » చార్మినార్ ఎక్కి అక్షయ్ కుమార్ సందడి(ఫోటోలు)

చార్మినార్ ఎక్కి అక్షయ్ కుమార్ సందడి(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శుక్రవారం చార్మినార్‌ను సందర్శించి సందడి చేసారు. తన తాజా సినిమా 'బాస్' ప్రమోషన్లో భాగంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ వచ్చారు. అక్షయ్ చార్మినార్ సందర్శనకు వచ్చిన విషయం తెలియగానే అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలి వచ్చారు.

చార్మినార్ ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తూ అక్షయ్ కుమార్ సందడిగా గడిపారు. ఇంత అందమైన కట్టడం చార్మినార్‌పై గీతలు, రాతలు చూసి అక్షయ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇంత అందమైన చారిత్రక కట్టడాన్ని ఇలాంటి చర్యలతో పాడు చేయవద్దని ఆయన కోరారు.

అక్షయ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసారు. అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఫోటోలు, బాస్ సినిమా వివరాలు స్లైడ్ షోలో.....

బాస్

బాస్


బాస్ చిత్రంలో అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, అదితి రావు హైదరి, శివ్ పండిత్, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆంటోనీ డిసౌజా దర్శకత్వం

ఆంటోనీ డిసౌజా దర్శకత్వం


బాస్ చిత్రానికి ఆంటోనీ డిసౌజా దర్శకత్వం వహించారు. ఇదొక యక్షన్ కామెడీ చిత్రం. అక్షయ్ మార్కు కామెడీ, యాక్షన్‌తో సినిమా ఫుల్లీలోడెడ్ ఎంటర్టెన్మెంట్‌తో ఉంటుంది.

నిర్మాణం

నిర్మాణం


ఈ చిత్రాన్ని అశ్వరిన్ వర్దే నిర్మించారు. కేఫ్ అండ్ గుడ్ ఫిల్మ్స్, అశ్విన్ వర్దే ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కింది.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


బాస్ చిత్రానికి పర్హాద్, సాజిద్ కథ సమకూర్చారు. మీట్ బ్రోస్ అంజాన్, చిరంతా భట్, పి.ఏ.దీపక్, యోయో హనీ సింగ్ సంగీతం అందించారు. ఆంటోనీ డిసౌజా దర్శకత్వం వహించారు.

విడుదల

విడుదల


అక్టోబర్ 16 ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వియాకాం 18 సంస్థ ఈచిత్రాన్ని వలర్డ్ వైడ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

English summary
Bollywood hero Akshay Kumar visits Charminar today, as part of the campaign his upcoming movie 'Boss'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu