»   » ఆమెను అంటే ఊరుకునేది లేదు: మండి పడ్డ హీరో

ఆమెను అంటే ఊరుకునేది లేదు: మండి పడ్డ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కి కోపం వచ్చింది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం వ్యక్తిత్వం లేని చర్య అని హృతిక్ మండిపడ్డారు. అది ఏదైనా అయి ఉండొచ్చని, అవసరం అయితే ప్రేమను పంచాలిగానీ ఇలా ఒకరిని బయటకు ఈడ్చడం సరైన పని కాదంటూ చిరాకు పడ్డాడు.

గ్లామరస్ హీరోయిన్ కంగనా కీ హృతిక్ కీ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కాస్తా మీడియా గోడలకెక్కటంతో ఈ ఇద్దరి అభిమానులూ రెండు వర్గాలుగా చీలిపోయి న్విమర్షలతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అయితే ఈ యుద్దం లో సహజంగానే కంగనా పై విమర్షలు పెరిగాయి. .

ఈ నేపథ్యం లో హృతిక్ తో కంగనా సంబందాల పై ట్విట్టర్ లో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం తో... హృతిక్ రోషన్ మండిపడ్డారు. కంగనాను ఆడిపోసుకుంటూ ట్విట్టర్లో వస్తున్న వ్యాఖ్యలకు హృతిక్ ఘాటుగానే స్పందించాడు.

Bollywood hero Hrithik serious on twitter comments on Kangana

"నేను కంగనా నటనను ఇష్టపడతాను. కానీ క్యారెక్టర్ లెస్ కంగనా దిగజారుడు జిమ్మిక్కులకు కాదు" అని ఒకరు వ్యాఖ్యని పోస్ట్ చేస్తే , "ప్రచారం కోసం వివాదాస్పద అంశాన్ని కంగనా ఉపయోగించుకుంటుంది, ఇది చాలా దిగజారుడుతనం. క్యారెక్టర్ లెస్ కంగనా"అంటూ మరొకరు...

ఇలా వరుసగా కంగనా పై వ్యతిరేకంగా వ్యాఖ్యలని పోస్ట్ చేస్తూండటం తో కొన్నాళ్ళు నిశ్శబ్దంగానే ఉన్న హృతిక్ ఇక ఓపెన్ అయ్యాడు. ఇంకొకరి వ్యక్తి గత జీవితం పై ఇలా వ్యాఖ్యానించటం సరికాదంటూ స్పందించాడు...

English summary
Bollywood hero Hrithik Answered to Twitter users Who is Tweeting cheap comments on Kangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu