»   »  బాలీవుడ్ హీరో నే... కానీ చార్మినార్ సెంటర్లో ఫూట్ పాత్ పై బట్టలు అమ్ముతూ ఇలా...

బాలీవుడ్ హీరో నే... కానీ చార్మినార్ సెంటర్లో ఫూట్ పాత్ పై బట్టలు అమ్ముతూ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్ లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది.

ఈ హీరో అక్కడ చెడ్డీలు అమ్ముతూ దర్శనమిచ్చాడు. భజరంగీ భాయ్ జాన్ లాంటి సినిమాల్లో మంచి పాత్ర‌ల్లో క‌నిపించి అంద‌రినీ అల‌రించిన ఆయ‌న.. 'ఫ్రీకీ అలీ' సినిమాలో హీరోగా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా ప్ర‌చారంలో భాగంగా జ‌నాల‌ని ఆక‌ట్టుకోవ‌డానికి ఇలా చెడ్డీలు అమ్మే వ్య‌క్తిగా అవ‌తార‌మెత్తాడు. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కూడా సిద్ధీఖీ చెడ్డీలు అమ్ముతాడ‌ట‌.

ప్రచారం లో భాగమే

ప్రచారం లో భాగమే

బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.

ఫ్రీకీ అలి

ఫ్రీకీ అలి

సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

కథేమిటంటే

కథేమిటంటే

ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్ మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్ గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు.

గోల్ఫ్ క్రీడ పై

గోల్ఫ్ క్రీడ పై

అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్ మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ.

దానికోసమే

దానికోసమే

అందుకే చార్మినార్ వ‌ద్ద చెడ్డీలను విక్ర‌యిస్తూ త‌న సినిమాని ప్ర‌చారం చేసుకున్నాడు. సిద్ధీఖీ చెడ్డీలు అమ్ముతుండ‌డం చూసిన జ‌నం చిరున‌వ్వులు చిందిస్తూ అత‌డితో ముచ్చ‌టిస్తూ ఎంజాయ్ చేశారు.

చార్మినార్ దగ్గరే

చార్మినార్ దగ్గరే

పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించిన అలీ అనే అబ్బాయి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ‌ పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడుగా త‌యారు కావ‌డ‌మే ఈ సినిమా కథాంశం. ప్రచారం సందర్భంగా చిత్రం టీమ్ అంతా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి చేసింది.

English summary
Nawazuddin Siddiqui is one actor with exceptional talent is caught selling underwear in Hyderabad recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu