Don't Miss!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
స్పీడ్ పెంచిన బెల్లంకొండ శ్రీను.. రజనీకాంత్ హీరోయిన్‌తో రొమాన్స్!
Recommended Video

సాక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రంపై కన్నేశాడు. తన నెక్ట్స్ మూవీని కొత్త దర్శకుడు శ్రీనివాస్‌తో చేయనున్నట్టు సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంటినేని (నాని) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాజల్ ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ తో పాటు మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రంలో నటించబోయే సెకండ్ హీరోయిన్ కు సంబంధించి క్యాథరిన్, ఇషా రెబ్బా పేర్లు వినిపించాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ మూవీలో బాలివుడ్ హీరోయిన్ అమీ జాక్షన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమెను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దర్శకుడు శ్రీనివాస్ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అబ్బూరి రవి మాటలు రాస్తున్న ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు.