మా వాళ్లకు హిందీ సినిమాలంటే ప్రేమ: అమీనా
పాకిస్తాన్ ప్రజలు తమ సినిమాలను బాలీవుడ్ సినిమాలతో పోల్చి చూస్తుంటారని ఆమె తెలిపారు. బాలీవుడ్‌లో మీ అభిమాన నటులెవరని అడిగితే అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్‌లతో నటించాలని తనకు ఆసక్తిగా ఉందని అమీనా షేక్ చెప్పారు.
మాత్, ఉరాన్, హమ్ తుమ్, దామ్ వంటి టీవీ సీరియళ్లలో అమీనా షేక్ నటించారు. షేక్ న్యూయార్క్‌లో జన్మించారు. బాల్యం మాత్రం కరాచీ, రియాద్‌ల్లో గడిచింది. తాము బాలివుడ్‌తో పోటీ పడాలని పాకిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఇరు దేశాల సినీ పరిశ్రమలకు మధ్య పొంతన లేదని, కానీ తామేమీ చేయలేమని, ప్రజలు బాలీవుడ్‌తో తాము పోటీ పడాలని ఆశిస్తున్నారని అన్నారు.
అమీనా షేక్ నటించిన జోష్ చిత్రానికి ఇరామ్ పర్వీన్ బిలాల్ దర్శకత్వం వహించారు. ముంబై చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన పాకిస్తాన్ చిత్రం ఇదొక్కటే. తాను ఇండియాకు తొలిసారి వచ్చినట్లు అమీనా షేక్ చెప్పారు. జోష్‌ను ఎంతో పేషన్‌తో, హృదయంతో నిర్మించినట్లు తెలిపారు. తాను ఈ చిత్రంలో ఫాతిమా పాత్రను పోషించినట్లు తెలిపారు. ఫాతిమా పాత్ర ప్రగతిశీల, అర్బన్ యువతులకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications












