»   » విడాకులకు దారి తీసిన సినీస్టార్ల ప్రేమ వివాహాలు

విడాకులకు దారి తీసిన సినీస్టార్ల ప్రేమ వివాహాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటలను పరిశీలిస్తే నూటికి 63 శాతం జంటలు ప్రేమ వివాహం చేసుకున్నవారే. వివానికి ముందు, వివాహం చేసుకున్నప్పుడు ఉన్నంత ప్రేమను చాలామంది భార్యభర్తలు ఎక్కువకాలం కొనసాగించలేక పోతున్నారని ... వారిమధ్య ఉన్న అమూల్యమైన ప్రేమను కూడా మర్చిపోయి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు.

సిని సెలబ్రిటీలు సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఏళ్ల తరబడి ప్రేమ పక్షులు గా పేరు తెచ్చుకుని, నిజమైన ప్రేమికులు అని ప్రశంసలు అందుకున్న వారు సైతం ఏదో ఒక సందర్భంలో గొడవలు పడి తమ ప్రేమ బంధానికి పులిస్టాప్ పెడుతున్నారు. తెలుగు సినీ సెలబ్రిటీల్లో ఇలాంటివి తక్కువే కానీ....బాలీవుడ్లో మాత్రం ఇలాంటివి కామన్ అయిపోయాయి.

బాలీవుడ్ స్టార్ హృతి రోషన్-సుజానె టీనేజీ వయసులోనే ప్రమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు తమ బంధాన్ని కొనసాగించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక ఇటీవల ఏదో ఒక చిన్న విషయంలో వచ్చిన గొడవ కారణంగా ఏళ్లతరబడి సాగిన తమ ప్రేమబంధాన్ని తెచ్చుకుని విడాకులు తీసుకున్నారు. కమల్ హాసన్, అమీర్ ఖాన్, కరీష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, మనీషా కొయిరాలా...ఈ లిస్టులో ఇలా చాలా మందే ఉన్నారు.

హృతిక్-సుజానె

హృతిక్-సుజానె

బాలీవుడ్లో అందరినీ షాక్ కు గురి చేసిన విడాకుల వ్యవహారం వీరిదే. టీనేజీ వయసు నుండి ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట విడిపోతారని ఎవరూ అనుకోలేదు.

కరణ్ సింగ్ గ్రోవర్-జెన్నిపర్ వింగెట్

కరణ్ సింగ్ గ్రోవర్-జెన్నిపర్ వింగెట్

ఇటీవలే బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ జంట విడాకులు తీసుకున్నారు.

అనురాగ్ కశ్యప్-కల్కి కోచ్లిన్

అనురాగ్ కశ్యప్-కల్కి కోచ్లిన్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి కల్కి కోచ్లిన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. ప్రస్తుతం స్నేహితులుగా కొనసాగుతున్నారు.

పూజాభట్-మనీష్

పూజాభట్-మనీష్

ప్రేమ వివాహం చేసుకున్న పూజా భట్, మనీష్....11 ఏళ్ల కాపురం అనంతరం విడిపోయారు.

కరిష్మా కపూర్-సంజయ్

కరిష్మా కపూర్-సంజయ్

కరిష్మా కపూర్, సంజయ్ విడాకుల వ్యవహారం ఈ మధ్య కాలంలో చాలా హాట్ టాపిక్ అయింది. ఒకరిపై ఒకరు అనుమానంతో వాడాకులు తీసుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్-అమృత

సైఫ్ అలీ ఖాన్-అమృత

సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ సినిమా రంగం ద్వారా పరిచయమై ప్రేమలో పడి పళ్లి చేసుకున్నారు. కానీ వీరు కాపురం 13 ఏళ్లకే విచ్చిన్నం అయింది. తర్వాత సైఫ్ కరీనాను పెళ్లాడాడు.

అమీర్ ఖాన్-రీనా దత్తా

అమీర్ ఖాన్-రీనా దత్తా

అమీర్ ఖాన్-రీనా దత్తా యంగేజ్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. తర్వాత అమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లాడారు.

చిత్రాంగద-జ్యోతి రందావ

చిత్రాంగద-జ్యోతి రందావ

జ్యోతి రంధావతో పెళ్లయిన తర్వాత చిత్రాంగధ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీరికొ ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఆమె సినిమాళ్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య విబేదాలొచ్చి విడిపోయారు.

మనీషా కొయిరాలా-సమ్రాట్ దహల్

మనీషా కొయిరాలా-సమ్రాట్ దహల్

మనీషా కొయిరాలా, సామ్రాట్ దహల్ 2010లో వివాహమాడారు. అయితే వేర్వేరు రంగాలకు చెందిన వీరు దంపతులుగా ఇమడలేక పోయారు. 2012లో విడిపోయారు.

సంజయ్ దత్-రియా పిళ్లై

సంజయ్ దత్-రియా పిళ్లై

సంజయ్ దత్, రియా పిళ్లై ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలానికే విడిపోయారు. తర్వాత ఆమె టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో సహజీవనం చేసింది.

కమల్ హాసన్-సారిక

కమల్ హాసన్-సారిక

కమల్ హాసన్,సారిక ప్రేమలో పడి సహజీవనం చేసారు. పెళ్లికి ముందే వీరికి శృతి హాసన్, అక్షర హీసన్ జన్మించారు. అనంతరం వీరు పెళ్లాడారు. అయితే పెళ్లయిన తర్వాత వీరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

ప్రియదర్శన్-లిజీ

ప్రియదర్శన్-లిజీ

దర్శకడు ప్రియదర్శన్-లిజీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో గతేడాది వీరు విడాకులు తీసుకున్నారు.

English summary
Has love lost it's value? Because going by the latest track record of our Bollywood couples, this do seems to be the case. There is a saying, "Never chase love, affection or attention. If it isn't given freely by another person it isn't worth having." Following this a tad too seriously, a lot of celebrities in the industry are letting go for their partners and opting for divorce.
Please Wait while comments are loading...