»   » ఇష్టంతో పడ్డ కష్టం ('మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌' ప్రివ్యూ)

ఇష్టంతో పడ్డ కష్టం ('మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఒంటరిగా శ్రమించి ఓ పర్వతాన్ని బద్దలు కొట్టి దారి నిర్మించిన వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మాంఝీ ది మౌంటేన్‌ మ్యాన్‌'. ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ రోజు ఈ చిత్రం విడుదల అవుతోంది.

చిత్రం కథమిటంటే...

బిహార్‌లో గెహ్‌లౌర్‌ గ్రామానికి చెందిన పేద దళితుడు దశరథ్‌ మాంఝీ. అతని బతుకంతా కష్టాలే. రోజూ కూలీకెళ్తేనే కడుపు నిండేది. పని దొరకని రోజు కాళ్లు డొక్కలో ముడుచుకుని తన గుడిసెలో పడుకునేవాడు. అయితే ఫల్గుణీ దేవి రాకతో ఆ గుడిసే స్వర్గధామంగా మారిపోయింది. ఆమె మాంఝీ భార్య. తనతో గడిపే ప్రతిక్షణమూ మాంఝీకి మరుపురాని మధుర జ్ఞాపకమే. ఆ గుడిసెలో అన్నానికి కరవుండేదేమో కానీ ప్రేమకు కాదు. భార్యంటే వల్లమాలిన ప్రేమ మాంఝీకి. ఓ రోజు అతని భార్య తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో దగ్గర్లోని పట్టణానికి తీసుకెళ్లడానికి బయలుదేరాడు.

అయితే ఆ వూరు కొండ ప్రాంతంలో ఉన్నందువల్ల సరైన దారి లేదు. కొండలను చుట్టుకుంటూ 70 కిలోమీటర్లు వెళ్తేనే పట్టణానికి చేరుకోగలరు. అలా వెళ్తుండగానే దారి మధ్యలోనే ప్రాణాలు విడిచింది ఫల్గుణీ. చికిత్స సకాలంలో అందకపోవడం వల్లే ఆమె మృతిచెందిందని వైద్యులు చెప్పారు. అది విన్న మాంఝీ గుండెలవిసేలా రోదించాడు. తన భార్యను తన నుంచి దూరం చేసిన ఆ కొండను పిండి చేయాలని నిశ్చయించుకున్నాడు.

తన భార్యలా ఇంకెవరూ వూళ్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి కొండను తొలిచి దారి నిర్మించడమే మార్గమనుకున్నాడు. ఆ సంకల్పంతో ఒక్కడే సైన్యంలా కదిలాడు. సుత్తి ఉలితో రాళ్లు పగలకొట్టడం మొదలెట్టాడు. మాంఝీ చేస్తున్నది పిచ్చి పని అని గ్రామస్థులు చేసిన వేళాకోలాన్ని పట్టించుకోలేదు. మొక్కవోని దీక్షతో ఇరవై రెండేళ్లు శ్రమించి కొండను కరిగించాడు. దీంతో పట్టణానికి ఉండే 70 కి.మీ. దూరం 15 కి.మీ.కు తగ్గింది. మాంఝీ శ్రమను అతని సొంతూరే కాదు బిహార్‌ ప్రభుత్వమూ గుర్తించింది.

Bollywood Movie Manjhi - The Mountain Man preview

మాంఝీ నిర్మించిన దారిని అభివృద్ధి చేసి దానికి అతని పేరు పెట్టింది. మాంఝీ చేసిన సేవకుగాను అతని పేరును పద్మశ్రీ పురస్కారానికి ప్రతిపాదించింది. ఆయన మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

ప్రజల గుండెల్లో మౌంటెన్‌ మ్యాన్‌గా నిలిచిపోయిన మాంఝీ జీవిత కథను 'మాంఝీ: ది మౌంటెన్‌ మ్యాన్‌' పేరుతో దర్శకుడు కేతన్‌ మెహతా తెరకెక్కించారు. మాంఝీగా నవాజుద్దీన్‌ సిద్దిఖీ, ఆయన భార్యగా రాధికా ఆప్టే నటించిన ఆ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేతన్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. వయోకాం 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తన బాహువులుతో ...22 సంవత్సరాలు పాటు శ్రమించి కొండను తవ్విన వీరుడి నిజ జీవిత కథ ఇది. ఆ ట్రైలర్ మరోసారి చూడండి...

ఇంతకీ 'మాంఝీ' ఎవరూ అంటారా... భార్యపై తనకున్న ప్రేమతో ఏకంగా కొండనే తవ్వేశాడు బిహార్‌కు చెందిన దశరథ్‌ మాంఝీ. ఆయన గ్రామం కొండప్రాంతంలో ఉండటంతో సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై మరణించింది.

దీంతో చలించిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఈ కథతో చిత్రం వస్తోంది.

English summary
In Manjhi — The Mountain Man, Nawazuddin Siddiqui brings alive the biopic of an ordinary man who performed an extraordinary feat. Radhika Apte plays his beloved wife Falguni Devi.
Please Wait while comments are loading...