twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌ దత్‌కి జైలు : కోర్టు అలా, తోటి సెలబ్రిటీలు ఇలా!

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నరనే నేరంపై జైలు కెళ్ల బోతున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల జైలు శిక్షకుగాను ఇప్పటికే 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన సంజయ్ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. తాజాగా సుప్రీం కోర్టు అతన్ని మిగిలి ఉన్న మూడున్నరేళ్ల శిక్ష అనుభవించాల్సిందిగా, కోర్టులో లొంగి పోవాల్సిందిగా ఆదేశించింది.

    సంజయ్ దత్ విషయంలో కోర్టు తీర్పు నేపథ్యంలో బాలీవుడ్ అంతా ఒక్కసారి షాక్ కు గురైంది. కోర్టు సాక్షాధారాలు అన్ని పరిశీలించిన తర్వాత సంజయ్‌ దత్‌ను దోషిగా తేల్చింది. అయితే తోటి సినీ తారలు మాత్రం కోర్టు తీర్పును జీర్ణించుకోలేక పోతున్నారు. సంజయ్ చాలా మంచోడని, అతనికి అలా జరిగి ఉండ కూడదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ జైలుకెళ్లడంపై ఎవరు ఎలా స్పందించారు అనే వివరాలు క్రింద పరిశీలిద్దాం...

    మహేష్ భట్ : సంజయ్ దత్ జైలు వెలుతున్నాడనే వార్త విన్నాను. ఈ వార్త విని నా గుండె పగిలిపోయింది. కోర్టు అతని పట్ల దయ చూపుతుందని అనుకున్నా...కానీ అలా జరుగలేదు.

    కునాల్ కోహ్లి : ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రదారుడు హాయిగా పాకిస్థాన్లో ఉన్నాడు. అప్పటి పేలుళ్లలో సంజయ్ దత్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసు సంజయ్ మెడకు చుట్టడం బాధాకరం.

    కరణ్ జోహార్ : ఇలా జరుగుతుందని అనుకోలేదు. సంజయ్ ఎంతో మంచి వాడు.

    విశాల్ దల్దాని : కోర్టు తీర్పును తప్పు బట్టడం లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు సంజయ్‌కి ఎదురు కావడం చాలా బాధించింది. ఆయన ఎంతో మంచివాడు.

    ఆశిష్ చౌదరి : సంజయ్ దత్ ఎంతో మంచి వాడు. ఇలా జరుగడం చాలా విచారకరం.

    ఫరా ఖాన్ : సంజయ్ ఎంతో మంచి వ్యక్తి. ఇలా జరుగడం విచారకరం. దేవుడు అతనికి గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    జయప్రద : ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ సుప్రీం కోర్టు నిర్ణయం ఫైనల్

    English summary
    
 Mumbai: Sanjay Dutt's conviction on Thursday by the Supreme Court in the 1993 Mumbai blasts case has left the Hindi film industry in shock and dismay. Filmmakers like Mahesh Bhatt and Karan Johar are sad about the judgement for the "good-hearted" man, who has been entertaining movie-goers for the past over three decades.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X