»   » త్రివిక్రమ్ కూడా.... కాపీ సీన్లు పెట్టాడంటూ విమర్శలు!

త్రివిక్రమ్ కూడా.... కాపీ సీన్లు పెట్టాడంటూ విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'S/O సత్యమూర్తి' సినిమాలోని ఓ సీన్ ఇపుడు హాట్ టాపిక్ అయింది. సదరు సీన్ బాలీవుడ్ సినిమా నుండి త్రివిక్రమ్ కాపీ కొట్టాడని పలువురు విమర్శిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ కావాలని ఆ సీన్ తన సినిమాలో వాడుకున్నాడా? లేక అనుకోకుండా ఇలా జరిగిందా? అనేది చర్చనీయాంశం అయింది.

తండ్రి మరణం తర్వాత ఆస్తులు, బంగళాలు అప్పులోళ్లకు వదిలేసి....సాధారణ ఇంట్లోకి వస్తుంది బన్నీఫ్యామిలీ. అప్పుడు బన్నీ అన్న కూతురు ఈ ఇల్లు ఏం బాగోలేదని గొడవ చేస్తుంది. అప్పుడు బన్నీ ఆమెకు సర్ది చెప్పే క్రమంలో ఇది ఓ రియాల్టీ షో. ఇందులో నువ్వు బాగా నటిస్తే బోలెడన్ని చాక్లెట్లు, ఐస్ క్రీములు ఇస్తారని నమ్మిస్తాడు.


Bollywood scenes in S/o Satyamurthy

అయితే ఇలాంటి సన్నివేశమే ఒకటి బాలీవుడ్ మూవీ ‘తారా రమ్ పమ్' సినిమాలో ఉంటుంది. సినిమాలో కార్ రేసర్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఆస్తులన్నీ కోల్పోతాడు. సాధారణ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు తన కూతురు కూడా ఇలానే గొడవ చేస్తే ఇది రియాల్టీ షో, ఇందులో మనం అంతా పాత్రధారులం అని నమ్మిస్తాడు.


ఇక సినిమా విషయానికిస్తే... నిన్న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడం, సమ్మర్ సీజన్ కావడంతో సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. తొలి రోజు ఈచిత్రం రూ. 8 కోట్లకు పైగా షేర్ సాధించి ఇప్పటి వరకు వచ్చిన బన్నీ చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలిచింది.


'S/O సత్యమూర్తి' చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
Bollywood movie “Tara Rum Pum” scenes in S/o Satyamurthy. Many critics are now blasting Trivikram for borrowing scenes from other films
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu