»   » ‘కిక్-2’ సినిమాలో బాలీవుడ్ కమెడియన్

‘కిక్-2’ సినిమాలో బాలీవుడ్ కమెడియన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘కిక్-2' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ కూడా నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై చిత్రీకరిస్తున్న సీన్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. టిపికల్ కామిక్ టైమింగ్, వెరైటీ మేనరిజం, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడం రాజ్ పాల్ యాదవ్ ప్రత్యేకత. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన రాజ్ పాల్ కిక్-2 ద్వారా టాలీవుడ్లోనూ నవ్వించడానికి వచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాలో అతని పాత్రను ప్రత్యేకంగా తీర్చి దిద్దాడని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇపుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా రవితేజ హీరోగా నటించే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.

Bollywood Star in Ravi Teja Kick 2

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అంటున్నారు. 'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ...యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది. ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథ:వక్కంతం వంశి, కెమెరా:మనోజ్ పరమహంస, సంగీతం:తమన్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.

English summary
Noted comedian Rajpal Yadav is making his debut in Telugu with 'Kick 2'. Here is the exclusive sneak peek of a conversation that's happening between Raviteja and Rajpal.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu