»   »  అర్ధరాత్రి బీచ్‌లో.. ప్రేమికుల రోజున షారుక్ ఏం చేశాడో తెలుసా..

అర్ధరాత్రి బీచ్‌లో.. ప్రేమికుల రోజున షారుక్ ఏం చేశాడో తెలుసా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణ జీవితం గడపడం సినీ ప్రముఖులకు చాలా కష్టమైన పనే. పిల్లలతో కలిసి సరదాగా తిరగడం కుదరని పని. అలాంటి కోరిక తీర్చుకోవడానికి సినీ స్టార్ అవకాశం దొరుకుంతుందా అని చూస్తుంటారు. సోమవారం రాత్రి తన కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి ముంబై సముద్ర తీరంలో విహరించారు.

 వీలు దొరికితే సరోగసి సన్‌తో..

వీలు దొరికితే సరోగసి సన్‌తో..

ఈ మధ్యకాలంలో ఎప్పుడూ సమయం దొరికినా అబ్ రామ్‌తో కలిసి ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం షారుక్‌కు అబ్ రామ్ మంచి నేస్తం. క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లినా.. లేదా ఇతర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినా తన సరోగసి కుమారుడు షారుక్ వెంటనే కనిపిస్తున్నాడు.

 అబ్‌రామ్‌తో కలిసి జుహులో ఇసుక గూళ్లు..

అబ్‌రామ్‌తో కలిసి జుహులో ఇసుక గూళ్లు..


‘సోమవారం అర్ధరాత్రి అబ్‌రామ్‌తో కలిసి జుహు బీచ్‌లో నడిచాను. చేతిలో చేయి వేసుకొని చాలా సేపు తిరిగాం. ఇసుకతో పిట్టగూళ్లు కట్టినాము. అవి చాలాకాలం అలానే ఉంటాయని నేను భావిస్తున్నాను' అని ట్విట్టర్‌లో తెలిపారు.

షారుక్ లానే రొమాన్స్ చేయండి..

షారుక్ లానే రొమాన్స్ చేయండి..


‘ప్రేమికుల రోజును పురస్కరించుకొని అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు. షారుక్ మాదిరిగా రొమాన్స్ చేయండి. నేను నిద్ర లేచినా తర్వాత వీలైతే మీ కోసం వాలంటైన్ మెసేజ్‌లు పంపుతాను' అని మరో ట్విట్‌ను షారుక్ చేశారు.

 వివాదమైన అబ్‌రామ్ జననం

వివాదమైన అబ్‌రామ్ జననం


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గౌరీ ఖాన్‌కు ఆర్యన్, సుహానా, అబ్ రామ్ అనే ముగ్గురు సంతానం. అబ్ రామ్‌ను అద్దె గర్భం (సరోగసి) విధానంలో కన్నారు. అబ్‌రామ్‌ అంటే షారుక్‌కు చాలా ఇష్టం. అబ్ రామ్ లింగ నిర్ధారణ పరీక్ష నిర్ధారణ అంశం గతంలో వివాదాస్పదమైంది.

English summary
AbRam is his father Shah Rukh Khan’s best friend. From a cricket match to a charity event, the two are always together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu