»   »  ధోని కూతురుకు సినీ ప్రముఖుల విషెస్.. జీవా బర్త్ డే ఎక్కడో తెలుసా?

ధోని కూతురుకు సినీ ప్రముఖుల విషెస్.. జీవా బర్త్ డే ఎక్కడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సాక్షిసింగ్ దంపతులు తమ కూతురు జీవా రెండో జన్మదిన వేడుకను సోమవారం ఉత్తరఖండ్‌లోని ముస్సోరి హిల్ స్టేషన్‌లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ వేడుకకు కొద్ది మంది సన్నిహిుతులను మాత్రమే ఆహ్వానించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ధోని తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. జీవా బర్తేడే సందర్భంగా ధోనికి ఫోన్ చేసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ విషెస్..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ విషెస్..


ధోని కూతురు జీవా బర్త్ డేను పురస్కరించుకొని బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రత్యేకంగా ట్విట్టర్లో విషెస్ తెలిపారు. ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన సంగతి తెలిసిందే. పలువురు క్రికెటర్లు జీవాకు జన్మదిన శుభాకాంక్షలను ఫోన్, సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

జీవా అంటే ధోని ఎంతో ఇష్టం

జీవా అంటే ధోని ఎంతో ఇష్టం

తన కూతురు జీవా అంటే ఎంఎస్ ధోనికి చాలా ఇష్టం. వీలు దొరికితే జీవాతో ఎక్కువ సమయం గడిపేందుకు కేటాయిస్తాడు. జీవా రెండో జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం కోసం ముస్పోరిలోని హిల్ స్టేషన్ కు చేరుకొన్నారు. ఈ వేడుకకు ధోని సతీమణి సాక్షి తన స్నేహితులను ఆహ్వానించింది. ఆదివారం రోజున వీరందరూ ఉత్తరాఖండ్ కు చేరుకున్నట్టు తెలుస్తున్నది.

 జీవా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయింపు

జీవా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయింపు

గతంలో క్రికెట్ టూర్ల సమయంలో కూడా జీవాను ధోని వెంటపెట్టుకొని వెళ్లిన సంగతి తెలిసిందే. పలుమార్లు ఇతర దేశాల్లో జరిగిన మ్యాచ్ ల సందర్భంగా తండ్రితో కలిసి జీవా దర్శనమిచ్చేది. ఆటపై దృష్టిపెట్టడంతోపాటు కుటుంబానికి కూడా అంతే మొత్తంలో సమయాన్ని కేటాయించడం ధోనికి అలవాటు.

ఉత్తరఖండ్ లోనే ధోని, సాక్షిల పెళ్లి

ఉత్తరఖండ్ లోనే ధోని, సాక్షిల పెళ్లి

ధోని, సాక్షిల పెళ్లి జరిగింది కూడా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లోనే. సాక్షి తండ్రి పాన్ సింగ్ ఉత్తరఖండ్‌లోని అల్మోరాకు చెందినవారు. ఉత్తరఖండ్ లోని హిల్ స్టేషన్లను సందర్శించడం ధోని దంపతులకు చాలా ఇష్టం.

 సన్నిహిుతులకు మాత్రమే ఆహ్వానం

సన్నిహిుతులకు మాత్రమే ఆహ్వానం


సోమవారం జీవా రెండో పుట్టిన రోజు కావడంతో తన భార్య సాక్షితో పాటు స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్‌ వెళ్లాడు. ఎప్పుడూ క్రికెట్‌తో బిజీగా ఉండే ధోని ప్రస్తుతం ఖాళీగా ఉన్నందున కుమార్తె రెండో జన్మదినాన్ని ప్రత్యేకంగా హిల్‌ స్టేషన్‌లో జరుపుకొంటున్నాడు. అందుకే కుటుంబం, స్నేహితులతో కలిసి ఆదివారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి చేరుకున్నారు.

సోషల్ మీడియాలో హల్ చల్

సోషల్ మీడియాలో హల్ చల్


ఇన్ స్టాగ్రామ్ సాక్షి పోస్ట్ చేసిన తమ కూతురు బర్త్ డేకు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ జీవాకు విషెస్ అందజేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
MS Dhoni is a loving father and his affection for daughter Ziva is well known. And to celebrate her second birthday, the former India captain along with wife Sakshi and friends have landed in Uttarakhand’s hill station Mussourie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu