హైదరాబాద్ లో థియేటర్‌కు బాంబు బెదిరింపు

ఈ నెల 21వ తేదీన హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 16 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి.మక్బూల్, ఇమ్రాన్ 2012 జులైలో దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. పాకిస్తాన్‌లో ఉంటున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ సూచన మేరకు వారిద్దరు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఎ అనుమానిస్తోంది. వారిద్దరినీ విచారిస్తే దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియగలవని ఎన్ఐఎ భావిస్తోంది.
గురువారం రోజు ఉగ్రవాదాలు అరగంటలోపే పేలుళ్ల పని పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు. సమీపంలో బస చేసిన ఉగ్రవాదులు కోణార్క్, వెంకటాద్రి థియేటర్లలో రెండు నిమిషాల వ్యవధిలో పేలుళ్లు జరిపారు. సైకిళ్లు తీసుకు వచ్చి పేలుళ్లు జరపడం ఇదంతా కేవలం అరగంటలోనే పూర్తి చేసినట్లుగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











