twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జంజీర్’ రీమేక్‌ పై మళ్లీ హై కోర్టుకి, కానీ...

    By Srikanya
    |

    ముంబై: రామ్ చరణ్ హీరోగా 'జంజీర్' రీమేక్ తెరకెక్కి విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మొదటనుంచి కోర్టు నోటీసులు తప్పటం లేదు. తాజాగా ఈ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని పాత జంజీర్ చిత్ర రచయితలు కోర్టు కెక్కారు. అయితే 'జంజీర్' సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు సోమవారం నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

    పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావేద్‌లు కోర్టును కోరారు.

    అయితే పిటిషనర్లు ఆలస్యంగా కేసు వేసినందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

    ఇక రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో పెద్ద సినిమాలు విడుదల సమస్య ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. ముఖ్యంగా 'తుఫాన్' సినిమాల విషయంలోనే ఈ సందిగ్ధావస్థ. ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించిన ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని చెప్తున్నారు.

    నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 'రచ్చ', 'నాయక్‌'లతో వరుస విజయాలను అందుకొన్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు హ్యాట్రిక్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌'. తెలుగులో 'తుఫాన్‌'గా వస్తోంది. ప్రియాంకా చోప్రా హీరోయిన్. అపూర్వ లాఖియా దర్శకుడు. శ్రీహరి, తనికెళ్లభరిణి, దేవ్‌గిల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పునీత్‌ ప్రకాష్‌మెహ్రా, సుమిత్‌ ప్రకాష్‌ మెహ్రా, ఫ్త్లెయింగ్‌ టర్టిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

    English summary
    
 
 Mumbai: In a setback to script writers Salim Khan and Javed Akhtar, the Bombay High Court on Monday refused to stay the release of film 'Zanjeer', a remake of the hit Amitabh Bachchan-starrer of the same name, made by Prakash Mehra, which is slated to hit screens this Friday. Salim and Javed had filed a suit in the High Court claiming they had copyrights over the script, story and dialogues of the 1973 blockbuster 'Zanjeer' and demanded Rs six crore as monetary compensation from the kin of Prakash Mehra for remaking the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X